20కోట్ల మందికి వచ్చింది.. పోయింది కూడా..!

NAGARJUNA NAKKA
రోగం లక్షణాలు కనిపిస్తే గుర్తించగలం. ఏ లక్షణమూ కనిపించకుండా విస్తరిస్తే.. గుర్తించడం అసాధ్యం. అందుకే కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బయటపడుతున్న కేసులు అతిస్వల్పంగా ఉన్నాయి. ఆగస్ట్‌ నాటికే 20 కోట్ల మందికి కరోనా సోకితే.. మరో నెల రోజుల్లో ఎంత మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు!

దేశంలో కరోనా వైరస్ విస్తరణ ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో కాస్త కంట్రోల్లో ఉన్న వైరస్.. అన్ లాక్ మొదలయ్యాక కట్టలు తెంచుకొని విస్తరిస్తోంది. ప్రస్తుతం కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలోనే అమెరికాను దాటే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న అసింప్టమ్యాటిక్ కేసులే.. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఐసీఎంఆర్‌ సర్వేలో 20 కోట్ల మందికి కరోనా వచ్చి పోయిందని తేలింది. శరీరంలో వైరస్ ఉన్నా.. లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో.. టెస్టులు చేయించుకోవడం లేదు. తాము ఆరోగ్యంగా ఉన్నామనే ఉద్దేశంతో సమాజంలో తిరిగేస్తున్నారు. దీంతో అసింప్టమ్యాటిక్ వ్యక్తుల నుంచి ఎక్కువ మందికి కరోనా విస్తరిస్తోంది. అందుకే సెరో సర్వేలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చాలా మందికి తెలియకుండానే వచ్చి నయమైందని, చనిపోతున్న వారి సంఖ్య కూడా ఒక శాతం లోపేనని తెలియడంతో.. ప్రజల్లో కూడా భయం తగ్గింది. దీంతో ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది కూడా కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది.  కరోనా వచ్చిన తొలి రోజుల్లో భారత్ పై వైరస్ ప్రభావం పెద్దగా ఉండదనుకున్నారు. తర్వాత లాక్ డౌన్ తో వైరస్ ఆట కట్టిస్తామన్నారు. ఆ తర్వాత ఇంత జనాభా ఉన్న దేశంలో ఆ మాత్రం కేసులు కామనే అన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ కరోనా కేసుల్లో ఆరో వంతు భారత్ లోనే ఉన్నాయంటే.. వైరస్ వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: