ప్రపంచ చరిత్రలో అరుదైన ఘట్టం.. భారత సైన్యానికి సాధ్యమైంది..?

praveen
భారత్-చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్-చైనా మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ ఎక్కడ చర్చలు మాత్రం ఫలించడం లేదు. ఒకవేళ చర్చలు ఫలించి  ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగినప్పటికీ చైనా మరోసారి తోక జాడిస్తు.. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూనే ఉంది. దీంతో రోజురోజుకు సరిహద్దులలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయి  యుద్ధమేఘాలు శరవేగంగా కమ్ముకుంటున్నాయి. అయితే భారత సైన్యం ప్రతి విషయంలో కూడా సరిహద్దులో చైనా సైన్యం కి భారీ షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే.




 ఇక లడక్ ప్రాంతంలో చైనా సైన్యానికి భారత సైన్యం షాక్ ఇవ్వడమే కాదు... ఏకంగా  ప్రపంచాన్ని సైతం అబ్బుర పరిచే విధంగా ప్రస్తుతం పనిచేస్తోంది. ప్రస్తుతం లడక్ ప్రాంతం లోని పర్వతాలపై సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో ఓవైపు భారీగా మంచు కురుస్తున్నప్పటికీ ఏకంగా 50000 మంది సైనికులను భారత్ మోహరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత ఆర్మీ చరిత్రలో ఇలాంటి భారీ  మిషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.




 దాదాపు -5 డిగ్రీల  నుంచి మైనస్ 32  డిగ్రీల చలి లో ఏకంగా 50 వేల మందికి  పైగా సైన్యాన్ని  ప్రస్తుతం మంచు  కురుస్తున్న ప్రాంతాలలో భారత్ నిలబెట్టింది. అయితే కేవలం ఒక్క సారి అలాంటి ప్రాంతం లోకి వచ్చి వెళ్లడం కాదు.. మొత్తం అక్కడే ఉండడం పడుకోవడం లాంటివి చేస్తున్నారు భారత సైనికులు. ప్రస్తుతం దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటి  వరకు ఏ దేశ సైన్యం కూడా ఇలాంటి తరహా ఘనత సాధించలేదు. మొదటి సారి భారత్ ఇలాంటి తరహా వ్యూహం అమలు చేస్తూ ఉండటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘట్టం అని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఒక్క ఘటన భారత ఆర్మీ ఎంత పటిష్టమైనదో   ప్రపంచానికి తెలియజేస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: