భారత సైన్యంలో కి కొత్త ఆయుధం.. చైనా కు భారీ షాక్..?

praveen
భారత్-చైనా సరిహద్దుల్లో  రోజురోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్న  విషయం తెలిసిందే. చైనాకు భారత్ తనదైన వ్యూహంతో  ఎన్నిసార్లు బుద్ధి చెప్పినప్పటికీ చైనా తోక జాడింపు  చర్యలు మాత్రం ఆపలేదు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ కూడా ఒప్పందాలను తుంగలో తొక్కి మళ్లీ రెచ్చగొట్టుడు వ్యవహారాలకు పాల్పడుతూనే ఉంది చైనా. ఎన్నిసార్లు చర్చలు జరిపిన అవి  నీటిలో పోసిన పన్నీరుగా మారిపోతున్నాయి . సరిహద్దుల్లో పరిస్థితులు మరింత హాట్ హాట్ గా మారుతున్నాయి తప్ప వివాదం సద్దుమణిగేలా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.



 సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం  కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  శరవేగంగా 5 రఫెల్స్  రప్పించిన భారత్... మరికొన్ని అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను కూడా భారత అమ్ములపొదిలో చేరుస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం గనక జరిగితే చైనాను సులభంగా మట్టుబెట్టే విధంగా ప్రస్తుతం అంతా సిద్ధం చేసుకుంటుంది భారత ప్రభుత్వం. కేవలం వివిధ దేశాలనుంచి ఆయుధాలను తేవడమే కాదు.. సుదీర్ఘకాలం పాటు భారత్లో పరిశోధనలు జరుగుతు పెండింగ్లో ఉన్న అన్ని రకాల ఆయుధాలకు  సంబంధించిన పరీక్షలు కూడా మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం.



 ఇప్పటికే డ్రోన్ లకు  సంబంధించి, సోలార్ వెపెన్స్ ను  సంబంధించి, గైడెడ్ మిస్సైల్ లకు సంబంధించి ప్రస్తుతం టెస్టులు జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్ గా మరో సరికొత్త ఆయుధాన్ని కూడా భారత అమ్ములపొదిలో చేర్చేందుకు సిద్ధమైన భారత్ టెస్టులు మొదలు పెట్టింది. ప్రస్తుతం న్యూక్లియర్ మిస్సైల్  అయినా ప్రిథ్వి -2 మిస్సైల్ రెండవ సారి పరీక్షల్లో  కూడా విజయం సాధించినట్లు తెలుస్తోంది. 350 కిలోమీటర్ల టార్గెట్ కి 1000 కిలోల  అణుబాంబులను తీసుకెళ్ల గలిగే  సత్తా దీనికి ఉంటుందట. దీనికి  సంబంధించిన టెస్టింగ్ విజయవంతం అవ్వడంతో త్వరలో ఇది భారత అమ్ములపొదిలో చేరే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: