భారత్ స్వాధీనం చేసుకుంది.. సింగపూర్ అంత భూభాగమట..?

praveen
మొన్నటి వరకు చైనా అంటే ప్రపంచం లోనే రెండవ అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశం గా ప్రపంచ దేశాలు భావించాయి . చైనా తో యుద్ధం ప్రమాదకరం అని అనుకున్నారు. కానీ చైనా సత్తా ఏంటి అనేది ప్రస్తుతం భారత్ లాంటి సరైన ప్రత్యర్థి ఎదురుపడినప్పుడు ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. సరైన ప్రత్యర్థి ఎదురుపడితే.. అప్పుడు వరకు గాంబీర్యం  ప్రదర్శించిన చైనా బేరసారాల కు దిగుతుంది అన్న విషయాన్ని ప్రపంచ దేశాలు కళ్లారా చూస్తున్నాయి. అయితే భారత్ చైనా సరిహద్దు లో చైనా మొదలుపెట్టిన వివాదాన్ని ప్రస్తుతం భారత ఆధీనం లోకి  తెచ్చుకున్న  విషయం తెలిసిందే.

 మొన్నటి వరకు శాంతియుతం గా సరిహద్దుల్లో చైనాను నిషేధిత ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాలి అంటూ భారత్ ఎన్నో చర్చలు జరిపింది. అయినప్పటి కీ చైనా మాత్రం వెనక్కి వెళ్లేందుకు ససేమిరా అంది. దీంతో ఇలా చైనా ను వెనక్కి వెళ్లాలి అంటూ చర్చలు జరిపితే సమయం వృధా అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు అని భావించిన భారత్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రమక్రమం గా చైనా అధీనంలో ఉన్న పలు భూభాగాల ను స్వాధీనం చూసుకుంటూ ముందుకు సాగుతుంది.

 దీంతో ఇన్ని రోజుల వరకు చైనా అజేయ  శక్తి అని అనుకుంటున్న ప్రపంచ దేశాల కు చైనా సత్తా ఏంటి  అని భారత్ నిరూపించిందని  విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ భారత్ సరిహద్దుల్లో ఎంత  భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది అనే దానిపై ఇటీవలే అమెరికా సంస్థ ఓ ఆసక్తికర వాదనలు వినిపించారు. సింగపూర్ విస్తీర్ణం ఎంత ఉంటుందో.. అంత భూభాగాన్ని భారత్ స్వాధీనంలోకి తీసుకుంది అన్న విషయాన్ని తెలిపారు. కానీ ఈ విషయాన్ని మాత్రం భారత ప్రతిపక్షాలు అంగీకరించక పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: