అక్కడ ఏం జరిగినా సీఎం మేనమామకు తెలియాల్సిందేనట..?

P.Nishanth Kumar
క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్రనాథ్‌రెడ్డి సీఎం జగన్ మేనమామ.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రాజకీయ నాయకుడు.. ఇప్పటివరకు ఈయన ఏనాడూ వార్తల్లో నిలవలేదు.. కారణం అయన మృదు స్వభావుడు అని అందరు అంటుంటారు.. ఈయన మంచి తనానికి అధికార పక్ష నేతలే కాదు ప్రతిపక్ష నేతలు కూడా ఫిదా అయిపోతుంటారు.. అందుకే ఆయన నియోజక వర్గంలో అంతా ఒక్కటే అన్న భావన ప్రచారంలో ఉంది.. ప్రతిపక్ష నేతలను కూడా తమవారిగా భావించే మంచి మనసు ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి ఆయన తన నియోజక వర్గం లో రెండు సార్లు విజయం సాధించి అక్కడి ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారని అక్కడి ప్రజలు చెప్తారు.. ప్రజలను ఏనాడు బాధపెట్టలేదు అని అక్కడి ప్రజలు ఆయన్ని తెగ పోగిడేస్తుంటారు..

ఎన్నికల్లో ప్రతిపక్షం వారు ఆయన్ని విమర్శించలేక జగన్ మాత్రమె విమర్శిస్తూ ప్రచారం చేశారంటే అయన వారికి కష్ట సమయాల్లో ఎంత అండగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు..తమ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు విమర్శించకపోవడమే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనపై విపాశాలు పెద్ద గా విమర్శలు చేసేవారు కాదు..  ముఖ్యమంత్రి మేన‌మామ కావ‌డంతో ప్రతిప‌క్ష నేత‌లు కూడా ఇక్కడ బ‌య‌ట‌కు వచ్చి విమర్శించే సాహసం చేసేవారు కాదు..  ఇక ఆయన మొహం చూసి చాలామంది టీడీపీ నేతలు వైసీపీ లోకి వచ్చేశారు అంటే ఆయన మంచి తనం గురించి చెప్పుకోకపోవడమే మంచిది..

ఏదేమైనా అన్ని నియోజక వర్గాల్లో మ‌రో నాలుగేళ్లు సైలెంట్‌గా ఉండి ప‌నులు చేయించుకోవాల‌ని కూడా ప్రతిప‌క్ష నేత‌లు ఓ నిర్ణయానికి వ‌చ్చేశారు. అందుకే అన్ని వైసీపీ సీట్లలో నేతలు అనిగిమనిగి ఉన్నారట.. ఇక ర‌వీంద్రనాథ్‌రెడ్డి అవినీతి పరుడు కాదని అందరికి తెలిసినా అయన పేరు చెప్పుకుని కొంతమంది ఉత్సాహవంతులు దోచుకుంటున్నారని అంటున్నారు.. ఈయన ప్రాంతంలో 14-15 ఇసుక రీచ్‌లు ఉన్నాయి.. ఆయ‌న పేరు చెప్పుకొని.. కొంద‌రు మాత్రం వెనుకేసుకుంటున్నారట. మంత్రి పదవి పై కొంత సందేహం ఉన్నా త్వరలో మేనమామకు ఉన్న ఆ ముచ్చట కూడా తీర్చేస్తారట జగన్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: