కరోనా మందు పేరుతో తండ్రికి పురుగుల మందు.. కానీ చివరికి కొడుకు మృతి..?

praveen
ప్రస్తుతం ఎవరిని కదిలించినా కరోనా  వైరస్ భయమే కనిపిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ప్రజలందరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తుంది. అందరిలో ఎంత అవగాహన ఉన్నప్పటికీ... కరోనా  వైరస్ అంటే భయం మాత్రం పోవడం లేదు. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో హృదయ విదారక ఘటన లు  తెర మీదికి వచ్చి హృదయాలను కలచివేస్తున్న  విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా  మందు పేరుతో కన్నకొడుకు పేరెంట్స్ కి పురుగుల మందులు ఇచ్చాడు అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.



 వివరాల్లోకి వెళితే... పంజాగుట్ట ప్రాంతానికి చెందిన అనిష్ రెడ్డి కరోనా నివారణకు మందు తీసుకు వచ్చాను అంటూ పురుగుల మందు తీసుకువచ్చి మూడు గ్లాసుల లో కలిపాడు. ఇక తల్లిదండ్రులకు ఈ మందు ఇవ్వడంతో పాటు తాను కూడా తాగడు. మొదట తండ్రితో పాటు మనీష్ రెడ్డి కూడా గ్లాసులో కలిపిన  పురుగుల మందు తాగగా అప్పుడే తల్లి వంటింట్లోకి వెళ్ళింది. వంటింట్లో నుంచి వచ్చి ఆ గ్లాసులో ఉన్న కరోనా  మందు తాగాలి అనుకుంది తల్లి. వంట గదిలో నుంచి బయటికి వచ్చి చూసే సరికి ఒక్కసారిగా షాక్. తండ్రీ కొడుకులిద్దరూ నురుగులు కక్కు కుంటూ గిలగిలా కొట్టుకుంటున్నారు.




 ఇక ఈ క్రమంలోనే అనిష్ ఎక్కువ పురుగుల మందు తాగడం తో పది నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం తండ్రి రాం రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులు.. ఆర్థిక సమస్యల కారణంగానే అనీష్  ఈ దారుణానికి పాల్పడ్డాడు అన్న విషయాన్ని గుర్తించారు. ఐటీ కంపెనీలకు క్యాటరింగ్ చేసే అనిష్  కి ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చెల్లింపులు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని దీంతో తీవ్ర మనస్థాపం చెంది... ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చు అని మృతుడి తల్లి పోలీస్ విచారణలో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: