వైఎస్సార్‌ అధికారంలోకి రావడానికి కారణమిదే!

Suma Kallamadi
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలు సిసలైన ప్రజానాయకుడు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అతని దూరదృష్టికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. రాజన్న పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించారు. పేద విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ అంటూ కోట్ల మంది తెలుగు విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ప్రధాన పాత్ర వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అధిరోహించ ముందువరకు కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా రైతులకు కరెంటు బిల్లు గురించి వినగానే భయపడిపోయారు. కానీ ఎవరూ కూడా కరెంటు బిల్లు గురించి భయపడకుండా చేస్తానని రైతులకు ఏకంగా ఉచిత కరెంటు అందిస్తామని తన పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచి.. తన హామీలను అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకున్నారు.

రైతులకు కరెంటు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వైఎస్సార్‌ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఓట్లు వేశారు. దాంతో పులివెందుల పులిబిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఆ క్షణం నుండి అనేకమైన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయం చేశారు. మాట తప్పడు మడమ తిప్పడు రీతిలో తాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే రైతులకు నిర్విరామంగా ఆరు గంటలపాటు ఉచిత కరెంటు సరఫరా చేసి అందరి ప్రశంసలను పొందారు.

రైతుల సాగునీటి కొరకు అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలివైన,  సమర్థవంతమైన నాయకుడిగా పేరొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పదవిలో ఉన్నన్ని రోజులు పేద ప్రజలకు అండగా నిలుస్తూ ప్రత్యక్ష దైవం అయ్యారు. అటువంటి గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయినందుకు మన తెలుగు ప్రజలందరూ దురదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఏదిఏమైనా రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: