చంద్రబాబు ఫ్లైఓవర్ రాజకీయం రివర్స్ అయిందా..?

Deekshitha Reddy
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అమరావతి పూర్తి కాలేదు, పోలవరం కాలేదు, మిగతా సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలుకి నోచుకోలేదు. అయితే ఆ ఐదేళ్లలో తమ ప్రతిభ ఇదీ అంటూ ఇటీవల ఫ్లైఓవర్ రాజకీయం చేస్తోంది టీడీపీ. ఈ రాజకీయం పూర్తిస్థాయిలో అదే పార్టీకి రివర్స్ లో తగులుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని మొదలు పెట్టిన ఈ ఫ్లైఓవర్ రాజకీయాన్ని చంద్రబాబు కూడా కంటిన్యూ చేశారు. తమ పార్టీ ప్రతిభ ఇదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ ఇది తమ విజయం అంటూ చేసుకుంటున్న ప్రచారాన్ని వైసీపీ తిప్పికొడుతోంది. టీడీపీ వదిలేసి వెళ్లిన పనులన్నిటినీ తాము పూర్తి చేస్తున్నామని, ఐదేళ్లలో కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తిచేయలేని స్థితిలో టీడీపీ అసమర్థ పాలన ఉందని కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో టీడీపీకి ఫ్లైఓవర్ రాజకీయం రివర్స్ లో తగిలినట్టయింది. మరోవైపు బీజేపీ కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో తమకూ వాటా ఉందని అనడం మరింత విడ్డూరం.
టీడీపీ లెక్కల ప్రకారం వారి పాలనలో దుర్గగుడి ఫ్లైఓవర్ 85శాతం పూర్తయిందట. అంటే ఐదేళ్ల కాలంలో కేవలం ఓ ఫ్లైఓవర్ పనుల్ని 85శాతం మాత్రమే పూర్తి చేయగలిగామని పరోక్షంగా టీడీపీ ఒప్పుకుంది. మిగిలిన 15శాతం పనుల్ని వైసీపీ ఏడాదిలోనే పూర్తి చేసింది. స్థానిక ఎన్నికలు, కరోనా కష్టాలు వంటి ఇబ్బందులు లేకపోతే కేవలం 6 నెలల కాలంలో దుర్గగుడి ఫ్లైఓవర్ మిగిలిన పనులు పూర్తయ్యేవని సమాచారం.

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్గగుడి ఫ్లైఓవర్ కి సంబంధించి దాదాపుగా 30శాతం పనులు పూర్తయ్యాయి. అంటే టీడీపీ గతంలో చేసింది 70శాతం మాత్రమేనని అర్థమవుతుంది. ఐదేళ్లలో ఒక ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబుకి వైసీపీని విమర్శించే అర్హత లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. ఇలా సగం సగం పనులు చేసినందుకే గత ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: