బాబోయ్.. కరోనా కౌగిట్లో ఏపీ.. దేశంలో టాప్ 30 జిల్లాల్లో 12 అక్కడే..?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. దేశంలోనే టాప్ గా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇండియాలో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కొత్త కేసులు వస్తున్న రాష్ట్రంగా నిలుస్తోంది. ఏపీలో రోజూ దాదాపు పది వేలకుపైగా కేసులు వస్తున్నాయంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ కొన్ని జిల్లాల్లో కరోనా విజృంభణ మరీ దారుణంగా ఉంది. గోదావరి జిల్లాలు, కర్నూలు వంటి జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా పాకిపోయింది.


ఆ జిల్లాల్లో కరోనా ఎంతగా విజృంభిస్తుందంటే..అవి దేశంలోనే టాప్ జిల్లాలుగా రికార్డుల్లోకి ఎక్కేశాయి. దేశంలోని మొత్తం టాప్ 30 జిల్లాలను లెక్కతీస్తే.. అందులో 12 జిల్లాలు ఏపీ నుంచే ఉండటం చూస్తే ఏపీలో కరోనా ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో ఉన్నదే 13 జిల్లాలు.. అందులో 12 జిల్లాలు దేశంలోనే టాప్ వచ్చాయి. రోజువారీ అత్యధిక కేసులు వస్తున్న టాప్‌-10 జిల్లాల్లో 5 మహారాష్ట్రవి  ఉన్నాయి. ఇక ఏపీ నుంచి తూర్పుగోదావరి, నెల్లూరు టాప్ ఫైవ్‌లో ఉన్నాయి.



ఇక టాప్‌-15లో కడప, విశాఖ, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. టాప్‌-30లో చిత్తూరు, కర్నూలు, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం ఉన్నాయి. టాప్‌-30 జిల్లాల్లో ఏపీలోని 12 జిల్లాలు ఉన్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 43 శాతం ఈ టాప్ 30 జిల్లాల్లోనే ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.


అయితే ఇదంతా కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే అనే వాదన ఉన్నా.. అదొక్కటే కారణంగా చెప్పలేం. ఎదుకంటే దేశంలో కూడా కరోనా టెస్టులు బాగానే నిర్వహిస్తున్నారు. ఇదివరకు ఎన్నడూలేని విధంగా ఐ సీఎంఆర్‌ ఒక్క రోజులో 10,55,027 పరీక్షలు నిర్వహించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: