అమెరికా అధ్యక్షురాలిగా ఇవాంకా..? - ప్లేటు ఫిరాంయించిన ట్రంప్..!
అయితే విపక్షం తన ఉపాధ్యక్షపదవికి ఓ మహిళను ఎంపిక చేసింది. ఆమే భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్.. ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమలా హారిస్ వంటి వారు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సరిపోరు అంటూ కామెంట్ చేశారు. ఇదే సమయంలో ఆయన మరో ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. ఈ దేశానికి ఓ మహిళ అధ్యక్షురాలు కావాలని తాను కూడా కోరుకుంటానని.. అందుకు తన కూతురు ఇవాంకా సరిగ్గా సరిపోతారని కామెంట్ చేశారు.
అంతే కాదు కమలాహారిస్ పై ట్రంప్ మరికొన్ని విమర్శలు చేశారు. కమలా హారీస్ అసమర్థురాలని.. ఉన్నత పదవులకు సరిపోరని.. కామెంట్ చేశారు. తాను కూడా దేశానికి ఓ మహిళ అధ్యక్షురాలిగా ఉండాలని కోరుకుంటున్నానని... అయితే కమలాహారీస్ లాంటి వారు కాదని.. ఇవాంక అయితే అధ్యక్ష పదవికి సరిపోతారని కామెంట్ చేసారు. అంతే కాదు.. కమలా హారీస్ ఏమైనా అందగత్తా? ఇంకా ప్రచారాన్నే ప్రారంభించలేదు. కొద్ది రోజులు గడిస్తే ఆమెకు ప్రజల ఆదరణ పడిపోతుంది అంటూ కామెంట్ చేశారు ట్రంప్.
ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తానికి అలా ఇవాంక అమెరికా
అధ్యక్షపదవి రేసులోకి ప్రతిపాదనలోనైనా వచ్చేశారు.. వాస్తవానికి ఇవాంకాది ఆకట్టుకునే అందం, అలాగే వాక్చాతుర్యమూ ఉంది. ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ఆమె అమెరికాకు ప్రెసిడెంట్ కావాలన్న ట్రంప్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.