ఒకదాంతోనే చస్తుంటే ఇప్పుడు టీడీపీ మరో గండం..కోలుకోవడం కష్టమే..?

P.Nishanth Kumar
టీడీపీ పరిస్థితి ఎలా తయారైంది అంటే పార్టీ ని ఎలా ముందుకు నడపాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతుంది.. ఓ వైపు అధికార పార్టీ విమర్శలతో కొంచెం కూడా కోలుకోకుండా ఉన్న టీడీపీ కి వరుస అరెస్ట్ లతో కుదేలయిపోయింది.. ఏ లీడర్ పైకి ఎప్పుడు వస్తుందా అని టీడీపీ నేతలు వణికిపోతున్నారు.. అందుకే వారు ఏ విషయంలోనూ వైసీపీ ని పెద్ద గా విమర్శించట్లేదు.. గతంలో చేసిన వారు ఇప్పుడు సైలెంట్ అవడానికి కారణం కూడా అదే.. ఇక వైసీపీ తన దూకుడును మరింత పెంచే విధంగా ముందుకు పోతుండగా టీడీపీ దాఖలాలు రాష్ట్రంలో ఉండనిచ్చేటట్లు లేదు అని అర్థమైపోతుంది..

ఇక ఇప్పటివరకు అధికార ఆపార్టీ ఒక్కటే టీడీపీ ని ఆడుకుంటుంటే బీజేపీ కూడా టీడీపీ ని టార్గెట్ చేసుకుని చెడుగుడు ఆడుకుంటుంది.. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ సహ ఇంఛార్జి సునిల్‌ దియోధర్‌ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు అర్థం గా నిలుస్తున్నాయి.. చంద్రబాబు వెన్నుపోటు కు 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ చంద్రబాబు రాజకీయాల నుంచి కూడా పూర్తిగా నిష్క్రమించబోతున్నారంటూ బాంబు పేల్చారు. అదే సమయంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర విభాగం ఈ సందర్భంగా బాబుపై సెటైర్‌ వేసింది. చంద్రబాబుకు వెన్నుపోటు దినం శుభాకాంక్షలంటూ చురక అంటించింది.

ఈ విషయంలో ఇప్పటికే  వైసీపీ చేస్తున్న విమర్శలను తట్టుకోలేకపోతున్నా చంద్రబాబు ఇలా బీజేపీ లోని ప్రతి ఒక్కరు వేలెత్తి చూపడంతో వారిని  ఎలా ఎదుర్కొవాలో తెలియక టీడీపీ నానా తంటాలు పడుతుంది. ఇక బీజేపీ లో రెండవ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న క్రమంలో టీడీపీ ని నామరూపాల్లేకుండా చేయాలనీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై మునుపెన్నడూలేని విధంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యం అని ప్రకటించిన బీజేపీ నేతలు ఆ దిశగా పయనిస్తున్నట్లు వారు చేస్తున్న రాజకీయం ద్వారా అర్థం అవుతోంది.ఎన్నికలు రాకముందే బీజేపీ టీడీపీ ఇలా ఆడేసుకుంటుంటే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ ఏవిధంగా విమర్శిస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: