డిసెంబర్ 3 తరువాత ఇండియాలో ఒకట్రెండు కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే మిగులుతాయి..!

Suma Kallamadi
వచ్చే రెండు వారాల్లో భారత దేశంలో కరోనా యాక్టివ్  కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఫాక్ట్-ఇండియా అవుట్ బ్రేక్, ప్రోటివిటీ రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో సెప్టెంబర్ 2 సెప్టెంబర్ 7 లోపు 7.87 లక్షలకు కరోనా యాక్టివ్ కేసులు చేరుకుంటాయి. ఆ తర్వాత అనగా సెప్టెంబర్ 16వ తేదీ నుండి కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గనుందని నివేదిక పేర్కొంది.

సెప్టెంబర్ మధ్యభాగం నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు కరోనా వైరస్్ యాక్టివ్ కేసుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతూ చివరకు కరోనా కేసులు ఒకటో రెండో మాత్రమే భారతదేశంలో మిగులుతాయని నివేదిక చెబుతోంది. సెప్టెంబర్ 14వ తేదీన మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసులు 2.23 లక్షలకు చేరుకుంటుందని టైమ్స్ ఫాక్ట్-ఇండియా అవుట్ బ్రేక్, ప్రోటివిటీ రీసెర్చ్ నివేదిక పేర్కొన్నది. కర్ణాటక రాష్ట్రంలో ఆగస్టు 28 వ తేదీన కరోనా వైరస్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుందని నివేదిక పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ పీక్ స్టేజ్ దాటేసిందని నివేదిక పేర్కొంది.

ఆగస్టు 20వ తేదీ వరకు భారతదేశంలో 28.37 లక్షల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...  6.86 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం దాదాపు 21 లక్షల మంది కరోనా వైరస్ రోగులు కోలుకున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కరోజులోనే 60 వేల పైచిలుకు కేసులు నమోదు కాగా... ప్రపంచంలోనే 24 గంటల్లో అతి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం అమెరికాలో 55 లక్షల కేసులు నమోదు కాగా... బ్రెజిల్ లో 33 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ రెండు దేశాల తర్వాత మూడవ స్థానంలో ఉన్న మన భారతదేశంలో 28 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ రెండు దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: