కరోనా విజేతల్లో కలవరం.. 75 శాతం మందిలో ఈ లక్షణాలు.. కొన్ని రోజుల్లోనే..?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో  చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే. శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతోమందిలో  ప్రాణ భయం కలిగిస్తోంది, ప్రపంచ ప్రజానీకం మొత్తం కరోనా  వైరస్ పేరెత్తితే చాలు గజగజ వణికిపోతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ పై ప్రజల్లో మొదట్లో లాగా భయం లేదు అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ పై అవగాహన పెరిగి పోవడంతో.. కరోనా  సోకినప్పటికీ వైరస్ తో పోరాడి మళ్లీ ఆరోగ్యవంతులుగా కావచ్చు అని ఎంతో మందిలో దైర్యం నిండి పోతుంది నేటి రోజుల్లో. మరోవైపు అటు కరోనా  వైరస్ వ్యాక్సిన్ రాబోతుంది అనే వార్త కూడా అందరిలో మరింత ధైర్యం నింపుతుంది.



 ఈ పరిణామాల నేపథ్యంలో పరిశోధనల్లో వెల్లడి అవుతున్నది విషయాలు మాత్రం మరోసారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి అనే చెప్పాలి. రికవరీ రేటు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నప్పటికీ... వైరస్  బారినపడి కోలుకున్న తర్వాత కూడా మూడొంతుల మంది మూడు నెలల తర్వాత కరోనా  లక్షణాలతో బాధపడుతున్నారు అన్నది తాజా అధ్యయనంలో తేలింది. 110 మంది పేషెంట్స్ ని పరిశీలించగా  81 మంది శ్వాస  తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు, కరోనా  వైరస్ ను జయించిన తర్వాత కూడా కొద్ది రోజులకే.. ఆయాసం కండరాల నొప్పులు రావడం లాంటివి సమస్యలు తలెత్తుతున్నాయట.  



 ఇటీవలే బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో  ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రోజువారి పనులు చేసుకోవడం లో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట కరోనా  నుంచి కోలుకున్న వారు.వైరస్  లక్షణాలైన జ్వరం దగ్గు కండరాల నొప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తీవ్రమైన ఆయాసం లాంటి లక్షణాలు కరోనా  వైరస్ నుంచి కోలుకున్న కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఎదుర్కొంటున్నారట ఎంతోమంది. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: