ఆ విషయంలో భర్తను బెదిరించబోయిన నవవధువు. చివరికి..?

praveen
ఎన్నో ఆశలతో నవ వధువు అత్తవారింట అడుగు పెట్టింది.. దాంపత్య జీవితాన్ని హాయిగా గడపాలని కోటి ఆశలు పెట్టుకుంది. నవ వధువు ఆశలన్నీ కొన్ని రోజుల్లోనే ఆవిరైపోయాయి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో ప్రాణాలు పోయాయి. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చాలానే తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. చిన్న కారణాలకే మనస్థాపం చెంది ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా ఓ నవ వధువు భర్తను బెదిరించాలీ  అనుకుంది కానీ చివరికి ప్రాణాలు వదిలింది. భర్త బిజీగా ఉండి ఫోన్ మాట్లాడక పోవడంతో అలిగిన నవ వధువు ఏకంగా  ఉరి వేసుకుంటాను అంటూ బెదిరించి చివరికి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన  తమిళనాడు వెలుగులోకి వచ్చింది,



 వివరాల్లోకి వెళితే..  తిరువల్లూరు సమీపంలోని కందన్  కొట్టై  గ్రామానికి చెందిన హరిబాబు షర్మిలకు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య వీరి వివాహం  ఘనంగా జరిగింది. అయితే హరిబాబు ఇటీవలే పనికోసం కాంచీపురం వెళ్ళాడు.. ఇక భార్య షర్మిల ఈ సమయంలోనే భర్తకు ఫోన్ చేసింది. హరిబాబు బిజీగా ఉండడంతో భార్య కాల్ ఎత్త లేకపోయాడు. రెండు మూడు సార్లు ఫోన్ చేసినప్పటికీ భర్త మాత్రం ఫోన్ తీయలేదు. దీంతో భర్తపై అలిగింది భార్య  షర్మిల. భర్త ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదో  ఇంటికి రాగానే నిలదీయాలని అనుకుంది.



 సాయంత్రం భర్త ఇంటికి రానే వచ్చాడు.. తాను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటూ భర్తను ప్రశ్నించింది భార్య.. భర్తను బెదిరించేందుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఓ గదిలోకి వెళ్ళి గడియ  వేసింది. ఇక ఈ క్రమంలోనే భర్తను ఉరి వేసుకుంటున్నట్టుగా బెదిరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఉరి తాడు మెడకు బిగుసుకుంది.  దీంతో విలవిలాడుతూ ప్రాణాలు వదిలింది సదరు నవవధువు. భర్త హరీ బాబు కేకలు వేయడంతో స్థానికులు అందరూ అక్కడికి చేరుకొని చూడగా షర్మిల ఉరికి శవంగా వేలాడుతూ కనిపించింది  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: