కేరళ విమాన ప్రమాదంలో 14 మంది మృతి: మృతుల సంఖ్య భారీగా..? అదే అసలు కారణం..!?
తాజా వార్తలు అందే సమయానికి ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందినట్టు.. మలప్పురం ఎస్పీ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వర్షం కురస్తుండటం కారణంగా సహాయచర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. విమాన శకలాల కింద ఎంత మంది ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో పది మంది పసివాళ్లు కూడా ఉన్నారు. విమానానికి సంబధించిన ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదం ఘటన గురించి తెలియగానే ప్రధాని మోడీ కేరళ సీఎంతో మాట్లాడారు. సహాయచర్యల గురించి ఆరా తీశారు. రాష్ట్రపతి కోవింద్ ఈ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారంతా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రమాద ఘటన తెలియగానే పౌరవిమానయాన శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయచర్యల గురించి చర్చించింది. విమానం అతి వేగంగా రన్ వే పై దిగడమే ప్రమాదానికి కారణంగా ప్రాధమికంగా బావిస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించింది.