దేవుడా...! ఇందుకే భార్యని వదిలేసాడా...?
భార్య అందంగా లేదు అని బక్కగా ఉందని చెప్పి తన భార్యని వదిలేసాడు ఓ భర్త. ఆ అమాయకురాలిని. తల్లిదండ్రులతో కలిసి ఆమెను పుట్టింటి పంపించేశాడు. ఇంకేం చేస్తుంది ఆ బాధితురాలు.... తన తల్లితో కలిసి ఆమె భర్త ఇంటి ముందు ధర్నా చెయ్యడానికి సిద్ధం అయ్యింది. వివరాల్లోకి వెళితే.... కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం వలుకూరుకు చెందిన ఈరమ్మ కూతురు మాధవిని వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన నాగ మద్దయ్య, ఎల్లమ్మ కుమారుడు రామాంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వారి పెళ్లి అయ్యి ఏడాది కావొస్తోంది అంతే. ఏ లోటు లేకుండా రామాంజనేయులు కుటుంబానికి పెళ్లి సమయం లోనే కట్న కానుకలు ఇచ్చారు. అయితే ఆరు నెలల వరకు అన్ని బాగా సాగాయి.
కానీ గత కొన్ని రోజుల నుండి ఆమెకి వేధింపులు మొదలు అయ్యాయి. భార్య అందంగా లేదని, బక్కగా ఉందని భర్త తన తల్లిదండ్రులతో కలిసి ఆమెని తరిమేసారు. ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ చేసేందుకు ప్రయత్నించినా ఆ అమ్మాయి ఇష్టం లేదని చెబుతున్నాడు భర్త. పోలీసులకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీనితో ఆమె ధర్నా కి దిగింది. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది.