రష్యా కరోనా వాక్సిన్.. మాకొద్దు బాబోయ్ అంటున్న దేశాలు..?

praveen
ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లోనే బతుకును వెళ్లదీస్తున్నారు. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్న తరుణంలో ఏ రోజు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ... గడుపుతున్నారు ప్రజలు. అగ్రరాజ్యాల్లో  ఈ మహమ్మారి వైరస్ మరింత తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో... ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపుగా ఆరు నెలల సమయం గడిచిపోతుంది. దీంతో ప్రపంచ ప్రజానీకం మొత్తం ఈ మహమ్మారి వైరస్ కి విరుగుడు కోసం ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తుంది,



ప్రస్తుత పరిణామాలు కూడా వైరస్ కు విరుగుడు అందుబాటులోకి వస్తే తప్ప పరిస్థితి సద్దుమణిగేలా  కనిపించడం లేదు. దాదాపుగా అన్ని దేశాలు కరోనా  వైరస్ వ్యాక్సిన్ తయారు చేయగా పలు దేశాల వాక్సిన్ లు  క్లినికల్ ట్రయల్స్ దశలో  ఉన్నాయి, కాగా చైనా రష్యా దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి  చేసిన విషయం తెలిసిందే. కానీ  చైనా రష్యాల కరోనా  వ్యాక్సిన్ పై  ప్రస్తుతం ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే చైనా రష్యాలు తాము అభివృద్ధి చేసిన వాక్సిన్ లను  ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండానే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.


క్లినికల్ ట్రైల్స్  లేకుండా మార్కెట్లోకి విడుదల చేయడంతో వాక్సిన్ సామర్థ్యం పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది నిపుణులు. ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేయడం ఎంత మాత్రం సురక్షితం కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. క్లినికల్ ట్రయల్స్ జరగకుండా మార్కెట్లోకి వచ్చిన ఔషధాలను తాము  వాడే  ప్రసక్తి లేదని ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మిగతా దేశాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి కరోనా వాక్సిన్ తీసుకొచ్చేది తామే  అంటూ రెండు రోజుల క్రితం ప్రకటించింది రష్యా.  ఆగస్టు 12న వ్యాక్సిన్  విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇది ఒక శుభవార్త అయినప్పటికీ క్లినికల్ ట్రయల్స్ లేకుండా మార్కెట్లోకి వస్తే మాత్రం అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: