చంద్రబాబు కు సవాల్ విసిరిన రోజా.. అలా చేస్తే వికేంద్రీకరణ పై పునరాలోచిస్తామంటూ..?
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలందరూ ప్రతిపక్ష టిడిపి కి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే టిడిపి కి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన నేపథ్యంలో... ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇటీవలే ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచేంత దమ్ము ఉందా చంద్రబాబు గారు అంటూ మంత్రి కొడాలి నాని చంద్రబాబు కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై స్పందించిన నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా... టిడిపి కి సవాల్ విసిరారు. దమ్ముంటే 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరోసారి ఉప ఎన్నికల్లో గెలుపొంది చూపించాలి అంటూ సవాల్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా. అలా ఉప ఎన్నికలకు వెళ్లి టిడిపి నేతలందరూ మరోసారి ఎమ్మెల్యేలుగా గెలిస్తే రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని..నమ్ముతాము అంటూ వ్యాఖ్యానించారు, అప్పుడు ప్రభుత్వం మూడు రాజధానులు పై పునరాలోచన చేస్తోంది అంటూ రోజా తెలిపారు. కాగా ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా టిడిపి పార్టీకి సవాల్ విసురుతూ ఉండటం ఎంతో కీలకంగా మారుతుంది.Powered by Froala Editor