గాంధీ - ఫాదర్ ఆఫ్ నేషన్.. సోనూసూద్ -బ్రదర్‌ ఆఫ్ నేషన్..!?

Chakravarthi Kalyan

సోనూసూద్.. ఈ మధ్య కాలంలో ఇంతగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలబ్రెటీ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆల్రెడీ సెలబ్రెటీలకు పాపులారిటీ అవసరం లేదు. అందులోనూ  సోనూసూద్ పాపులారిటీ కోసం పనులు చేయడం లేదు. సోనూసూద్‌ చేస్తున్న సహాయ కార్యక్రమాలు ఎంతటి వారికైనా ఔరా అనిపించకమానవు. 

 


ఒక మనిషి తలచుకుంటే ఇంతగా సేవ చేయగలడా అని ఇప్పుడు జనం ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ ఏ కష్టం వచ్చిందని తెలిసినా.. వెంటనే సాయపడుతూ శభాష్ అనిపించు కుంటున్నాడు. అందులోనూ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు కూడా పెద్దగా లేనందువల్ల సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడేమో.  


   

సోనూసూద్ సేవా కార్యక్రమాలు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఆయన సేవా గుణాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అందులో.. రాధిక అనే ఓ నెటిజన్ సోనూసూద్‌ ను మహాత్మా గాంధీతో పోలుస్తూ పెట్టిన పోస్టు భలే ఇంట్రస్టింగ్ గా ఉంది. మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే సోనూసూద్ బ్రదర్ ఆఫ్ నేషన్ అంటూ ఆమె వర్ణించినతీరు చాలా బావుంది. ఈ పోస్టును మెచ్చుకుంటూ నెటిజన్లు భలే కామెంట్లు పెడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: