ప్రపంచానికి గుడ్ న్యూస్: మరో టీకా వచ్చేస్తోంది.. ఇది మరీ సూపర్..?

frame ప్రపంచానికి గుడ్ న్యూస్: మరో టీకా వచ్చేస్తోంది.. ఇది మరీ సూపర్..?

Chakravarthi Kalyan

కరోనాతో వణికిపోతున్న ప్రజలకు ఇది శుభవార్తే.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేందుకు చాలా సమయం పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ సంస్థ నుంచి టీకా ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయి. మొదటి రెండు దశలు విజయ వంతంగా పూర్తయ్యాయి. ఇక ఈ దశ కూడా విజయవంతం అయితే టీకా రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

 

IHG


ఇంతకీ ఈ టీకా ఏ దేశానిది అంటారా.. ఇది అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ టీకా. దీని ప్రయోగం విజయవంతమైతే నవంబర్- డిసెంబర్ కల్లా టీకా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ సంస్థ తాజాగా  మూడో దశ ప్రయోగాలు ప్రారంభించింది. భారీ సంఖ్యలో 30 వేల మంది వాలంటీర్లకు  టీకాను ఇస్తోంది. 

 

IHG


ఈ మూడో విడత ప్రయోగం సక్సస్ అయితే..  అక్టోబర్‌ లో అధికారికంగా  అనుమతులు పొందొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే ఇక భారీ స్థాయిలో వ్యాక్సీన్ ను ఉత్పత్తి చేస్తారు. ఇలా చేసేందుకు మోడెర్నా ఏడాదికి బిలియన్‌ డోసుల తయారీని టార్గెట్ గా పెట్టుకుంది. వ్యాక్సిన్‌ సమర్థంగా పని చేస్తే ప్రయోగాలు పూర్తయ్యే నాటికి మోడెర్నా వద్ద లక్షల డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని అంచనా. 

 

 

ఈ మోడెర్నా  సంస్థ టీకాపై అమెరికా ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకే ఈ సంస్థకు ఆర్థికంగా కూడా సహాయపడుతోంది. ఈ ప్రయోగం వివరాలను ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు చెబుతున్నారు. మోడెర్నా సంస్థ టీకాలు వేగంగా ఉత్పత్తి చేసేందుకు కొత్త టెక్నాలజీ వాడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: