మానవత్వం మాయం చేసిన కరోనా.. అతన్ని చంపేసింది..?
ఒక వ్యక్తి లో కరోనా లక్షణాలు ఉంటే చాలు ఆ వ్యక్తి ప్రాణాలు పోతున్నా ఆమడ దూరంలో నిల్చుని సినిమా చూసినట్లు చూస్తున్నారు కానీ సహాయం చేసేందుకు మాత్రం ముందుకు రావటం లేదు. ప్రస్తుతం తోటి మనిషినే మనిషికి శత్రువుగా మార్చేసింది ఈ కరోనా . తాజాగా జరిగిన ఘటనతో మనుషుల్లో మానవత్వం మాయమైపోయింది అన్నది మరో సారి నిరూపితమైంది. కరోనా రోగి మంచం కింద పడి లేవలేని స్థితిలో ప్రాణాపాయంలో విలవిలలాడుతున్న.. ఎవరు సహాయం చేయలేదు చివరికి.. విలవిలలాడుతూనే ప్రాణాలు వదిలాడు సదరు వ్యక్తి. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది ఈ ఘటన.
గంగాధర మండలం వెంకటం పల్లి కి చెందిన 70 ఏళ్ల వ్యక్తి కరోనా సోకడంతో ఐదు రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆయన పరిస్థితి విషమించింది. దీంతో మంచం మీద నుంచి కిందపడ్డాడు. 15 నిమిషాల పాటు గిలగిల కొట్టుకున్నాడు. ఇక పక్కనే ఉన్న వారు ఇది చూస్తూ ఉండిపోయారు కానీ సహాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో.. గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలాడు ఆవ్యక్తి.Powered by Froala Editor