ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న హరీష్ రావు.... కరోనా టైంలో ఏం చేశారంటే....?

Reddy P Rajasekhar

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. వేలల్లో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. వైరస్ వ్యాప్తి వల్ల ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఫోన్ల ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ముఖ్యమైన పనులను పూర్తి చేస్తున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న తరుణంలో మంత్రి హరీష్ రావు మాత్రం ప్రజల మధ్యే తిరుగుతూ సలహాలు, సూచనలు ఇస్తూ ప్రజలు హృదయాలను గెలుచుకుంటారు. 

 


 


రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారితో పాటు డెంగీ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు హరీష్ రావు డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధిపేటలోని హనుమాన్ నగర్ లో ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి, వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. 

 


 
ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటి నిల్వలను ప్రత్యక్షంగా ఇంటి కుటుంబీకులకు చూపి నీరు నిల్వ ఉండకుండా చూడాలని చెప్పారు. ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వలను తొలగించాలని... వ్యాధుల వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. డ్రై డే పాటించి ఒక్క నీటి చుక్క కూడా నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

 


 


డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం పది నిమిషాల సమయం కేటాయించి దోమల నివారణ కొరకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని అన్నారు.  మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీళ్లను ఖాళీ చేసి వ్యాధుల భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలని ప్రజలకు తెలిపారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: