నేనే సెలెక్ట్ అయితే.. రోహిత్ ను పక్కన పెట్టేస్తా.. ఆసీస్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టీమ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ముందుకి దూసుకుపోతోంది. ఈ క్రమంలో భారత్‌పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించిందంటే సాధారమైన విషయం కాదు. నాథన్ లియాన్ 54 బంతులకి గాను 41 పరుగులు చేయగా అందులో అయిదు ఫోర్లు ఉన్నాయి. ఇక స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనడం కూడా అసాధారణ విషయం అనే చెప్పుకోవాలి. ఒకే ఒక్క ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ 4వ నాటౌట్‌గా మిగిలారు. ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొని 55 పరుగులు చేయడం జరిగింది.
అయితే ఈ టెస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ విషయంలో మాత్రం విషాద జ్ఞాపకాలను మిగిల్చుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా అతని బ్యాటింగ్ వైఫల్యం విషయంలో ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్లు సైతం సెటైర్లు విసురుతున్నారు. రోహిత్ ఇక రిటైర్ అవ్వడం బెటర్ అని సలహాలిస్తోన్నారు. ఈ క్రమంలో రోహిత్ ఇక రన్స్ చెయ్యలేకపోతే నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగే అతనికి చివరిది అవుతుందని కూడా వ్యాఖ్యానించారు. అవును, మరోవైపు కొంతమంది విశ్లేషకులు కూడా అదేమాట అంటున్నారు కూడా. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ టెస్ట్ జీవితం ఏమిటనేది రెండో ఇన్నింగ్ డిసైడ్ చేస్తుందని, అందులో కూడా పరుగులు చేయకపోతే అతను రిటైర్ కావడం మంచిదని మార్క్ వా అనడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాకుండా తానే గనక సెలెక్టర్ స్థానంలో ఉంటే రెండో ఇన్నింగ్‌లో విఫలమైన రోహిత్ శర్మను మరలా తీసుకొనే వాడిని కాదని, రోహిత్ శర్మ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాను కేప్టెన్‌గా అపాయింట చేస్తానని కూడా చెప్పుకు రావడం ఇపుడు పలు వివాదాలకు దారితీస్తోంది. చివరి 14 ఇన్నింగ్‌లల్లో రోహిత్ శర్మ యావరేజ్ 11 మాత్రమేనని ఈ సందర్భంగా మార్క్ వా గుర్తు చేశాడు. అదే సమయంలో ఎంత మంచి బ్యాటర్ కూడా ఏదో ఒక దశలో కేరీర్ చరమాంకానికి చేరుకోక తప్పదనీ, రిటైర్ కావడం మంచిదేనంటూ కవర్ చేసుకొనే విధంగా మాట్లాడాడు. కాగా ఈ వ్యాఖలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: