అన్ లాక్ 2.0 : జగన్ సర్కార్ కీలక నిర్ణయం... ఇంటర్ విద్యలో భారీ మార్పులు.....?

Reddy P Rajasekhar

అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత దేశంలో అడ్డూఅదుపూ లేకుండా విజృంభిస్తోన్న కరోనా వైరస్ ధాటికి అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా విద్యా రంగంపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి నెల మూడో వారంలో మూతబడిన పాఠశాలలు, కాలేజీలు నేటికీ తెరచుకోలేదు. ఇప్పట్లో పాఠశాలలు తెరచుకోవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. 

 


 


విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆన్ లైన్ క్లాసుల ద్వారా పెద్దగా ఉపయోగం లేదని అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల పదో తరగతి, ఇంటర్ చదివే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ద్యారంగాన్ని మాములు స్థితికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. 

 


 
ఏపీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంవత్సరం రూపకల్పన, కాలేజీల పునః ప్రారంభం, పనిదినాలు, సిలబస్ కుదింపు, ఆన్ లైన్, ఆఫ్‌లైన్‌ బోధనా విధానాలు, కోర్సుల్లో మార్పులు చేర్పులు వంటి కీలక విషయాల గురించి విద్యారంగ నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా జులై 31, 2020 సాయంత్రం 5 గంటలలోపు అభిప్రాయాలను తెలియజేయాలి. 

 


 
అందరి అభిప్రాయాలను పరిగణననలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటిస్తామని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ సంవత్సరం కరోనా విజృంభణ వల్ల ఇంటర్ విద్యలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. జగన్ సర్కార్ ఇంటర్ సిలబస్ ను కుదిస్తే మాత్రం విద్యార్థులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంటర్ విద్యలో ఎలాంటి మార్పులు చేయబోతుందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: