విద్యార్థులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం.. ఆ బెంగ అవసరం లేదు..?

praveen
మామూలుగా కొన్ని ప్రవేశ పరీక్షలను విద్యార్థులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు  అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ప్రవేశాల కోసం ఎన్నో కఠిన నిబంధనలు కూడా అమలులో ఉంటాయి. నిట్  సహా మరికొన్ని టెక్నికల్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అర్హత సాధించేందుకు విద్యార్థులకు ఎన్నో కఠిన నిబంధనలు ఉండేవి. ప్రతి విద్యార్థి కూడా 12వ తరగతిలో 75 శాతం మార్కులు సాధించి ఉండటంతోపాటు.. టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్  కూడా సాధించాల్సి ఉండేది. ఈ క్రమంలోనే నిట్ సహా ఇతర టెక్నికల్ ప్రవేశానికి అర్హత సాధించేందుకు ఎంతోమంది విద్యార్థులు తీవ్రంగా శ్రమించేవారు.కానీ  కొన్నిసార్లు విద్యార్థులకు నిరాశ ఎదురయ్యేది. కానీ ప్రస్తుతం కేంద్రం  తీసుకున్న నిర్ణయం మాత్రం విద్యార్థులకు శుభవార్తే అని చెప్పాలి.


నిట్ సహా ఇతర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కు సంబంధించి కఠిన నిబంధనలను సడలిస్తు  తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో  75 శాతం మార్కులు సాధించి ఉండాల్సిన అవసరం లేదని నిబంధనలను సడలించింది కేంద్ర ప్రభుత్వం. 12వ తరగతి లో ఉత్తీర్ణులు అయితే సరిపోతుంది అంటూ తెలిపింది. కరోనా  వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే పలు బోర్డుల  పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పరీక్షలను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కరోనా వ్యాప్తితో  అవి కాస్త వాయిదాపడ్డాయి.



 ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రమేష్ ప్రోక్రియల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వాస్తవానికి అయితే ఇప్పటికే నిట్  సహా ఇతర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది, కరోనా తో జేఈఈ  మెయిన్స్ పరీక్షలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షల కోసం విద్యార్ధులందరూ ఎంతో నిరీక్షణకు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: