ట్రంప్ వ్యూహం.. చైనాకు భారీ షాక్.. ఇది డ్రాగన్ ఊహకందనిదే..?

praveen

ఎన్నో రోజుల నుంచి చైనాపై అగ్గిమీదగుగ్గిలం గా అమెరికా తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నది అన్నవిషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా వ్యవహారంపై ప్రతి విషయంలో కూడా విమర్శలు చేస్తూ  ఉన్నారు. ముఖ్యంగా చైనా నుంచి వ్యాప్తి చెంది ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న కరోనా వైరస్ గురించి.. చైనా విస్తరణ వాదం  గురించి... చైనా వివిధ దేశాల పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి... అంతేకాకుండా చైనా వివాదాల గురించి. ఇలా ప్రతి విషయంలో అమెరికా సర్కార్ కల్పించుకుని మరి చైనా పై  ఎన్నో విమర్శలు సైతం చేస్తోంది. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి  తీవ్రస్థాయిలో చైనాపై మాటల యుద్ధం చేస్తూ విరుచుకుపడుతుంది అమెరికా. ట్రంప్ హయాంలోని ప్రభుత్వ యంత్రాంగం సైతం చైనాపై  మాటల దాడికి దిగుతున్నారు. 

 

 అయితే ప్రస్తుతం చైనా తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రపంచ దేశాలు చైనా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నాయి అన్న  విషయం తెలిసిందే. ఈ విషయంలో అగ్రరాజ్యమైన అమెరికా అయితే మరింత పదునైన  వ్యూహాలు అమలు చేస్తోంది. అయితే తాజాగా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడం లో భాగంగా అమెరికా కీలక అడుగు ముందుకేసింది. ఇప్పటికే పలు దేశాలలో చైనా కు సంబంధించిన పలు కంపెనీలు నిషేధానికి గురి కాగా.. తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకుని  చైనాకు  ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. 

 

 చైనా కు సంబంధించిన 11 కంపెనీలను అమెరికాలో నిషేధిస్తూ ట్రంప్  సర్కారు నిర్ణయం తీసుకుంది. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ప్రస్తుతం ఈ 11 కంపెనీలపై నిషేధం విధించింది. చైనా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి కంపెనీలను కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం.  ఈ కంపెనీల నిషేధం పై అమెరికా ఆసక్తికర కారణం చెప్పింది. చైనా లో  ఉన్న 37 కంపెనీల్లో పలు కంపెనీలు... ఉద్యోగులను తీవ్రంగా హింసిస్తూ బానిసలుగా చూస్తూ.. వీగర్  ముస్లింలను అణగదొక్కేందుకు  ప్రయత్నిస్తున్నారని... ఇది  పూర్తిగా మానవ హక్కులకు విరుద్ధం అని... ఈ క్రమంలోనే చైనా కి  సంబంధించిన కంపెనీలను అమెరికాలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. మరి దీనిపై  చైనా ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: