జ‘గన్‘ పేలింది... ఐసీయూలో ప్రముఖులు... గల్లంతయిన ప్రధాన పార్టీలు

జ‘గన్‘ పేలింది... ఐసీయూలో ప్రముఖులు... గల్లంతయిన ప్రధాన పార్టీలు, పరిస్థితులు విషమించే అవకాశం ... ఇదీ... శుక్రవారం రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన అనూహ్య ఘటన పరిణామం. ఇదేమిటి తుపాకి పేలితే తీవ్రగాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం ఐసియూలో చేరడం వరకు ఓకే, కాని ప్రదాన పార్టీలు గల్లంతవడం ఏమిటి...పరిస్థితులు విశమించే అవకాశం ఉండటమేమిటి అనుకోవచ్చు. నిజమే పేలిన తుపాకి ప్రాణాలు తీసే బుల్లెట్ ను వదిలేది కాదు.. నీతి,అవీనీతి, నాయకుడు,ప్రతినాయకుడు ఎవరో తేల్చి చేప్పేది మరి. పలితం ఒకేఒక బుల్లెట్ కు రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధులు తమ రాజకీయ జీవితపు చావుబ్రతుకుల మద్య కొట్టు మిట్టాడుతూ ఐసీయూలోకి చేరగా,ప్రధానపార్టీలైన అధికార కాంగ్రేస్,ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు గల్లంతయ్యాయి. ఏది నిజం,ఏది అబద్దం అన్నది కాలం నిర్ణయిస్థుంది అన్నదానితో ఎవరు విభేందించరు. ఒక్కని కోసం అందరు ఒక్కటయ్యారా...ఎవరి కోసం వారే పోరాడారా... అన్నవిషయాన్ని కాస్తా పక్కన బెట్టి జరిగిన దాన్ని, దాని పలితాన్ని పరిశీలిస్తే జనం తీర్పు రాష్ట్ర రాజకీయ రూపురేఖలనే మార్చి వేయనుంది...కాదు మార్చి వేసింది అనడమే నిజమేమో.ఎందుకంటే మున్ముందు జరిగే పరిణామాలు అలాగే ఉండే సంకేతాలు జారీ అవుతున్నాయి.ఉప ఎన్నికల పలితాలను ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం 18 స్థానాల్లో ఎన్నికలు జరిగితే కేవలం రెండింటిలో కాంగ్రేస్ గెలిచింది. ఒక పరకాలలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణలో సెంటిమెంట్ ముందు ఏది పనిచేయదు అన్న టీఆర్ఎస్ దూకుడుకు ఈపలితం స్ట్రాంగ్ డోస్ నిచ్చింది. గెలుపు గూర్చి కాదు, మెజార్టీ ఎన్ని వేలు అని ప్రగల్భాలు పలికిన వారికి చివరిరౌండ్ వరకు వైఎస్ఆర్ సీపి ముచ్చెమటలు పట్టించడమే కాదు, ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ తన సొంతమే అని విర్రవీగుతున్న కేసిఆర్ గుండెపోటును తెప్పించనంత పని చేసి ఆయనను ఐసీయూలోకి పంపించింది.  ఒక్క కేసిఆర్ నే కాదు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన తిరుపతిలోను జ‘గన్‘ తూటా ఆయన సి.ఎం. పదవినే కాదు, రాష్ట్ర భావి కాంగ్రేస్ సారథిని నేనే అని భావిస్థున్న మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తును కూడా ఐసీయూలోకి నెట్టింది. ఓడిన మూడింటిలో పరకాలలో 1532,నరసాపురంలో4486,రాంచంద్రాపురంలో 12వేల పైచిలుకు తేడాతోనే ఓడి అక్కడ కూడా ఓటర్లెవరు ‘వై‘ అనకుండా‘ఎస్‘ అన్నారనే భావాన్నే కల్పించేలా చేశారు అన్నది రాజకీయ పరిశీలకుల భావన.  రెండు కళ్ల సిద్దాంతంతో చంద్రబాబునాయుడు టీడీపీని అటు ఆంధ్రలోనూ, ఇటు తెలంగాణలోను గల్లంతుచేసకున్నాడని, ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరించి కాంగ్రేస్ ఎటూ కాకుండా పోయిందన్నదన్న దానిని ఈ ఉపఎన్నికలు రుజువుచేశాయని మాత్రం ఒప్పుకోక తప్పదు. మొత్తం మీద పీసీసీ అధ్యక్షుడు బొత్స, సిఎం.కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, కేసిఆర్, చంద్రబాబునాయుడు లాంటి ప్రముఖులు మాత్రం ఐసీయూలో పడ్డట్లే. తెలుగుదేశం, కాంగ్రేస్ లనుంచి వైఎస్ఆర్ సీపి లోకి వలసలు జరుగుతాయా... ఇవి కిరణ్ ప్రభుత్వాన్ని పడగొడుతాయా... రాష్ట్రపతి పాలన వస్తుందా...ఏమో ఏమీ చెప్పలేం, వీటిలో ఏదైనా జరగవచ్చు. అందాక...వెయిట్ అండ్ సీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: