వెనక్కి వెళ్లేందుకు ఒప్పుకున్న చైనా.. కానీ కొత్త ఫిట్టింగ్..?

praveen

భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పటికీ.. చైనా ఏదో ఒక డబుల్ గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి ఇలాగే వ్యవహరిస్తుంది చైనా. తమది కాని భూభాగాన్ని తమది  అంటూ భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన చైనా... ఇటీవలే చర్చల తర్వాత ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. గాల్వన్ లోయ ప్రాంతంలో  పలుచోట్ల చైనా సైన్యం వెనక్కి వెళ్ళింది. అయితే చైనా సైన్యం వెనక్కి అయితే వెళ్ళింది కానీ మళ్ళీ డబుల్ గేమ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఇటీవలే  చైనా భారత్ సీనియర్ సైన్యాధికారుల మధ్య 15 గంటలపాటు చర్చలు  జరిగగా..దీనికి  సంబంధించిన వివరాలను  ఇటీవలే  భారత సైన్యం పూర్తి వివరాలతో ప్రకటన కూడా విడుదల చేసింది. 

 

 అయితే చర్చల తర్వాత గాల్వన్  లోయలోని అన్ని  ప్రాంతంలో చైనా సైన్యం వెనక్కి వెళ్లడం తో పాటు భారత సైన్యం కూడా వెనక్కి వచ్చింది. దీంతో వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో... చైనా కొత్త నాటకానికి తెర లేపింది. గాల్వాన్  లోయలోని అన్ని  ప్రాంతాల్లో వెనక్కి వెళ్లిన చైనా సైన్యం పాంగ్వాన్  సరస్సు దగ్గర మాత్రం వెనక్కి వెళ్లలేదు. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు చైనా సైన్యం వెనక్కి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కేవలం ఒక అడుగు వెనక్కి వేసి ఫింగర్ 5 దగ్గర తిష్ట వేసుకుని  కూర్చుంది  చైనా సైన్యం. దీని పై  ఇటీవలే జరిగిన చర్చల్లో పాంగ్వాన్  సరస్సు గురించి కూడా చర్చలు జరిపినట్లు సైన్యం ప్రకటన చేసింది. 

 

 ఈ నేపథ్యంలోనే పాంగ్వాన్ సరస్సు  దగ్గర కూడా  చైనా వెనక్కి వెళ్లేందుకు  ఒప్పుకుంది అన్నది తాజాగా భారత సైన్యం ప్రకటన చేసింది. ఇదే సమయంలో  చైనా ఫింగర్ 8 వరకు వెనక్కి తిరిగి వెళ్లాలి అంటే.. భారత సైన్యం ఫింగర్ 4 నుంచి 3 కి వెనక్కి వెళ్ళాలి అంటూ  చైనా డిమాండ్ చేసిందట. అయితే భారత సైన్యం మాత్రం  చైనా ఫింగర్ 8 వరకు వెనక్కి వెళ్లాల్సిందే అంటూ పట్టుబట్టిందట. కానీ తాము వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ చెప్పిందట. ఇంతకు ముందు లాగే ఇరు దేశాల సైన్యాలు యథాతథ స్థితిలో కొనసాగితే అందరికీ మంచిది అంటూ తేల్చి చెప్పిందట భారత సైన్యం. ఈ క్రమంలోనే చైనా వెనక్కి వెళ్లేందుకు ఒప్పుకుందట. అయితే ప్రస్తుతం చైనా వెనక్కి వెళ్లేందుకు అంగీకరించడమే కాదు అది ఆచరణలో చేయకపోతే మాత్రం తీవ్ర  ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: