ఛీ ఛీ.. వైద్యం చేయాల్సింది పోయి.. ఆ డాక్టర్ ఏం చేసాడో తెలుసా..?
వివరాల్లోకి వెళితే.. పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు తోసాడు. సేలం జిల్లా పెద్ద నాయకన్ పాలయం సమీపంలో.. కరుమాతురై ప్రాంతంలో మదీయగలన్ (24) అనే డాక్టర్ క్లినిక్ నడుపుతున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో... స్థానిక ప్రజలందరికి ఉచిత వైద్యం అందిస్తున్నాడు సదరు వైద్యుడు. అయితే ఉచిత వైద్యం అందిస్తున్నాడు కదా అని ఆ వైద్యుడు దేవుడు అని అనుకున్నారు స్థానికులు అందరు. కానీ కొంతకాలానికి అతనిలోని వక్రబుద్ధి బయటపడింది.
గత కొంతకాలం నుంచి 16 ఏళ్ల విద్యార్థునితో డాక్టర్ పరిచయం పెంచుకున్నాడు. ప్రస్తుతం నువ్వు మైనర్ అని నీకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ సదరు డాక్టర్ మాయమాటలు చెప్పాడు. అంతేకాదు సదరు బాలికను శారీరకంగా వంచించాడు. ఈ క్రమంలోనే ఆ డాక్టర్ మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది అని సదరు యువతి తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయింది. ఇక ఈ విషయంపై బాలిక ఏకంగా పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద డాక్టరు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు తోసాడు.Powered by Froala Editor