ఈ ఇద్దరి మంత్రులకు ఏమైంది ? అంత గ్యాప్ ఎందుకో ?
తెలంగాణ అధికార పార్టీలో ఇద్దరు మంత్రుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వారైనా, ఎడమొహం పెడమొహంగా ఉంటూ, దూరంగా దూరంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కెసిఆర్ ఎక్కు వగానే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. వారిలో పార్టీ సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ కాగా మరొకరు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇద్దరు వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ కు ప్రాధాన్యం దక్కడంతో, ఆయన మంత్రిగా చక్రం తిప్పుతూ వచ్చారు.
కానీ అనూహ్యంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గంగుల కమలాకర్ కు మంత్రి పదవి కట్టబెట్టినా, ఆ తరువాత ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమలాకర్ కు మంత్రి పదవి దక్కక ముందే ఈటెల రాజేందర్ ను క్యాబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రకాహారం పెద్దఎత్తున జరిగింది. రాజేందర్ పార్టీ అధినేత వ్యవహారశైలిపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం, పార్టీ స్థాపించినప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ లోనే ఉన్నామని, అని తాము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని ఎలా రకరకాలుగా అధిష్టానంపై ఈటెల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ నమ్మారు. కానీ అనూహ్యంగా ఈటెల కు మంత్రి పదవి దక్కింది.
ఇక ఆ తరువాత గంగుల కమలాకర్ కు కూడా మంత్రి పదవి దక్కింది. ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో కమలాకర్ కు ప్రాధాన్యం పెంచి ఈటల కు ప్రాధాన్యం తగ్గించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడం, ఈటెల రాజేందర్ తన నియోజకవర్గం హుజురాబాద్ కే పరిమితం అయిపోవడం, అలాగే కరీంనగర్ జడ్పీ సమావేశాలకు కూడా వేర్వేరు సమయాల్లో హాజరవుతుండడం వంటి పరిణామాలు అన్ని పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఈ వ్యవహారాలు అధిష్టానం వరకు వెళ్లడంతో మీ వివాదం కారణంగా పార్టీ పరువు బజారున పడుతుందని అధిష్టానం సీరియస్ గానే చెప్పడంతో, కరీంనగర్ కలెక్టరేట్ కు గంగుల స్వయంగా కారు నడుపుకుంటూ ఈటెల రాజేందర్ ను పక్కన కూర్చోబెట్టుకుని రావడం, తమ మధ్య ఎటువంటి వివాదం లేదని ,తామంతా కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇదంతా ప్రజలను నమ్మించడానికి తప్ప ఇద్దరి మధ్య పోరు మాత్రం అలాగే ఉందని తెలంగాణ ప్రజల్లో నడిసిస్తున్న చర్చ.