కొత్త రూల్స్ తెరమీదికి తేస్తున్న బ్యాంకర్లు.. మధ్యతరగతి సొంతింటి కల నెరవేరడం కష్టమేనా..?

praveen

బ్యాంకర్లు మధ్యతరగతి వారి విషయంలో వ్యవహరించే తీరుపై ఎప్పుడు ఎన్నో విమర్శలు పాలవుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. మధ్య తరగతి వాళ్ళ నుంచి ముక్కుపిండి మరీ ప్రతి ఒక్క రూపాయి వసూలు చేయడానికి  ప్రయత్నిస్తూ ఉంటారు బ్యాంకర్లు. ఇక ప్రతి విషయంలో కరాఖండిగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పెద్దపెద్ద సంపన్నులు వేల కోట్ల అప్పులు తీసుకుని అవి కట్టకుండా... కనీసం వడ్డీ కూడా కట్టకుండా విదేశాలకు చెక్కేసే విలాసవంతమైన జీవితాలను  గడుపుతూ ఉంటారు వారి పట్ల మాత్రం బ్యాంకర్లు అసలు కోపం తెచ్చుకోరు.. ఎలాంటి ఒత్తిడి తీసుకురారు . కానీ మధ్యతరగతి వారి విషయంలో కి వచ్చేసరికి మాత్రం.. బ్యాంకర్లకు ఎక్కడలేని రూల్స్ గుర్తుకు వస్తూ ఉంటాయి. దీంతో ఏదో ఒక  కారణంగా ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు బ్యాంకర్లు. 

 


కేవలం  ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో బ్యాంకర్లు మధ్యతరగతి వాళ్లకి కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రస్తుతం హౌస్ లోన్ తీసుకున్న వారికి బ్యాంకర్లు చుక్కలు చూపిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. బ్యాంకులో హౌస్ లోని వచ్చింది అంటే... విడతలవారీగా నిధులు మంజూరు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ కష్టకాలంలో బ్యాంకర్లు మధ్య తరగతి వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేరకుండా చేస్తున్నారు. కొంతమందికి అయితే ఇల్లు కట్టడం మధ్యలోనే ఆగిపోయే లా నిబంధనలు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో చాలా మంది ప్రైవేటు ఉద్యోగులు  ఉద్యోగాలను కోల్పోయిన  వారు ఉన్నారు. 

 


 ఈ క్రమంలోనే బ్యాంకులు ఇలా హోమ్ లోన్ విషయంలో ప్రివ్యూ నిర్వహిస్తున్నారు . గతంలో ఇచ్చిన డాక్యుమెంట్లు కాదు ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో మీ ఉద్యోగం ఇంకా ఉంది అని నిరూపించడానికి పేస్లిప్ తీసుకురావాలి అని డిమాండ్ చేస్తున్నారు బ్యాంకర్లు. ఒకవేళ ఉద్యోగం లేదు అని తేలిన పక్షంలో వారికి ఇచ్చే హోమ్ లోన్  అక్కడితో ఆపేస్తున్నారట. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి హోమ్ లోన్ క్యాన్సల్ చేస్తున్నారట. అంతేకాకుండా ఇప్పటి వరకు హోమ్ లోన్ ద్వారా తీసుకున్న సొమ్మును కూడా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట. అయి దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు అంటే కోట్లకి కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని వదిలేస్తారు కానీ.. ఎవరిని మోసం చేయకుండా తమ పని తాము చేసుకుని బతికె  మధ్య తరగతి వాళ్ళ విషయంలో మాత్రం ఎందుకు దయ చూపరు . అంతేకాకుండా బ్యాంకర్లు  కూడా మధ్య తరగతి వాళ్లే కదా మధ్య తరగతి వాళ్ళ సమస్యలు ఎందుకు అర్థం చేసుకోలేరు అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.

" height='150' width='250' src="https://www.youtube.com/embed/bkKSMz_UMAc" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen"> దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు అంటే కోట్లకి కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని వదిలేస్తారు కానీ.. ఎవరిని మోసం చేయకుండా తమ పని తాము చేసుకుని బతికె  మధ్య తరగతి వాళ్ళ విషయంలో మాత్రం ఎందుకు దయ చూపరు . అంతేకాకుండా బ్యాంకర్లు  కూడా మధ్య తరగతి వాళ్లే కదా మధ్య తరగతి వాళ్ళ సమస్యలు ఎందుకు అర్థం చేసుకోలేరు అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: