మీడియా మంటలు: జీతం ఇవ్వని ఉద్యోగం కోసం జీవితం ఇచ్చేయాలా..?
అంటూ జర్నలిస్టు మిత్రులు ఆవేదన చెందుతున్నారు.
న్యూస్ కవరేజ్ కోసం వెళితే దారిలో ప్రమాదం జరిగినా పనిచేసే సంస్ధలు పైసా ఇవ్వరని తెలుసు... పైగా జాగ్రత్తగా ఉండక్కర్లేదా అని జాలి చూపించి ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొనే మేనేజ్మెంట్లు ఉన్నాయని తెలుసు..రేపు లీవ్ తీసుకుని ఎల్లుండి వచ్చేయ్ అనే హృదయంలేని ఇన్చార్జులు... ఉన్నారని తెలుసు.. అన్నం తినే సమయంలో పక్క ఛానల్ లో బ్రేకింగ్ పడుతుంటే చేతులు కడుక్కొని పరిగెత్తాలని తెలుసు... అంటూ జర్నలిస్టుల జీవితాల్లోని కష్టాలు గుర్తు చేసుకుంటున్నారు. అర్దరాత్రి గాఢ నిద్రలో ఫోన్ రింగ్ అయితే పరిగెత్తాలని తెలుసు... 24 గం.లు ఫోన్ & వాట్సప్ ఆన్ లో ఉండాలని తెలుసు.. మిగిలిన బీట్లు లాగ కాకుండా 24 గం.లు డ్యూటి చేయాలని తెలుసు.. శవాలతో సావాసం, పోలీసులతో పరుగులు ఉంటాయని తెలుసు.. కుటుంబంతో ఒక పూట కూడా గడిపే అవకాశం ఉండదని తెలుసు.. మూడు పూటల టైమ్ ప్రకారం తినడం అంటే అద్బుతం అని తెలుసు... టైమ్ కి తినక ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు.. ఇన్ని తెలిసి కూడా ధైర్యంగా పనిచేస్తున్నాడంటే అదీ రిపోర్టర్ అంటే అని జర్నలిస్టులు మనోజ్ గురించి గుర్తు చేసుకుంటున్నారు.