వైజాగ్ పాలిటిక్స్: బాబుని జగన్ కరెక్ట్ టైమ్‌లో దెబ్బకొట్టారా?

M N Amaleswara rao

గత ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు....విశాఖపట్నంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. హూద్ హూద్ తుఫానుకు కోలుకోలేని దెబ్బతిన్న విశాఖని బాబు నాలుగేళ్లలో చెప్పుకోదగిన విధంగానే అభివృద్ధి చేశారు. కాకపోతే పెట్టుబడులు విషయంలో చెప్పినంత కాకపోయినా...కొంతవరకు ఇంప్లిమెంట్ చేశారు. అయితే చంద్రబాబు ఈ విధంగా చేయడం వల్లే, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ గట్టిగా ఉన్నా సరే...విశాఖ సిటీలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లని టీడీపీ గెలవగలిగింది.

 

ఇక ఎంపీ సీటుని కేవలం 4 వేల ఓట్ల తేడాతో కోల్పోయారు. అయితే జగన్ అధికారంలో రాగానే విశాఖలో టీడీపీని వీక్ చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళ్లారు. విజయసాయిరెడ్డి అక్కడే ఉంటూ....జగన్ ప్లాన్స్ వర్కౌట్ చేశారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఈ ప్లాన్ వల్ల రాష్ట్ర అభివృద్ధితో పాటు, విశాఖలో టీడీపీని దెబ్బకొట్టినట్లు అయింది.

 

అతి త్వరలోనే విశాఖకు రాజధాని రానుండటంతో అక్కడ వైసీపీకి అనుకూల పవనాలు వీయడం మొదలయ్యాయి. సిటీ ప్రాంతంలో టీడీపీ పూర్తిగా వీక్ అయిపోయింది. పేరుకు ఎమ్మెల్యేలు ఉన్నా వారికి అంత స్కోప్ లేకుండా పోయింది. ఇక విశాఖలో చంద్రబాబు మీద ఎంత వ్యతిరేకిత వచ్చిందో, మొన్న మధ్య ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనే ఉదాహరణగా ఉంది.

 

ఇలా కరెక్ట్ టైమ్‌లో బాబుని జగన్ దెబ్బకొట్టడం వల్ల, వైజాగ్ కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగరడానికి లైన్ క్లియర్ అయిపోయింది. ప్రస్తుతానికి ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైజాగ్‌ కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో పడటం ఖాయమని తెలిసిపోతుంది. ఇక ఈ ఎన్నికలు జరిగే ముందు కూడా టీడీపీకి మరిన్ని షాకులు తగలోచ్చని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జగన్‌కు మద్ధతు తెలిపే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే వైజాగ్ పాలిటిక్స్‌లో బాబు మీద జగన్ పైచేయి సాధించారనే చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: