కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి కరోనా పాజిటివ్..?
భారతదేశం పై పంజా విసురుతున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో అయితే విలయతాండవం చేస్తోంది. కొన్ని రాష్ట్రాలలో మహమ్మారి కరోనా వైరస్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మాత్రం పరిస్థితి రోజురోజుకూ తగ్గిపోతోంది. ఆయా రాష్ట్రాలలో నమోదవుతున్న కేసులు దేశం పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రజల నిర్లక్ష్యమా లేదా అధికారుల అసమర్థత.. ప్రభుత్వం చేతకాని తనమా అన్నది పక్కన పెడితే ఆయా రాష్ట్రాలలోని పెరిగిపోతున్న కేసులు మాత్రం దేశ ప్రజలు మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఓ వైపు ఈ మహమ్మారి వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆనందపడాలో లేదా కరోనా వైరస్ పెరుగుతున్నాయని బాధపడాలో అది అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అయితే కేవలం సామాన్య ప్రజలకే కాదు రోనా వైరస్పై రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు సూచించే అధికారులు కూడా ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ తేలుతుంది. ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే వారు మాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో అధికారులు కూడా వైరస్ బారిన పడాల్సి వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా ఈ మహమ్మారి వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భూతం ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం రేపుతోంది ఈ మహమ్మారి వైరస్. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని మూసిసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కరోనా పాజిటివ్ తెలిన వ్యక్తిని వెంటనే ఐసోలేషన్ వార్డులో తరలించగా ఆయనతో గత కొన్ని రోజుల నుంచి మరింత సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వారికి కూడా క్వారంటైన్ కి వెంకన్న పంపించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నీతి అయోగ్ కార్యక్రమంలో ఒక ఉద్యోగి కి వైరస్ పాజిటివ్ అని తేలిపోయింది. మొత్తం ఆఫీస్ ని మూసివేసి శానిటైస్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని శానిటైస్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.