పోతిరెడ్డిపాడును పూర్తి చేసింది మేమే... చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు... వాస్తవమేనా...?
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎన్టీఆర్ మొదలుపెట్టారని ఆ ప్రాజెక్ట్ తాను అధికారంలో ఉన్న సమయంలో పూర్తైందని తెలిపారు. . రాయలసీమకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులన్నీ ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు తెలిపారు. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పోతిరెడ్డిపాడుపై టీడీపీ మౌనవ్రతం అవలంబిస్తోందని అధికార పార్టీ నేతలు చేసిన విమర్శలను తోసిపుచ్చిన చంద్రబాబు సీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు తనకు మాత్రమే ఉందని తెలిపారు. తెలుగుగంగ ప్రాజెక్టు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు అన్నీ ఎన్టీఆర్ ప్రారంభించినవేనని అన్నారు. ముచ్చుమర్రి రాయలసీమకు జీవనాడి అని ఆనాడే చెప్పామని... పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి దాని ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు ఇచ్చామని అన్నారు.
కృష్ణా జలాలను పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇచ్చామని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన పనులను మేం రద్దు చేయాలేదని... కోర్టు వివాదాలతో సమయం వృధా కాకూడదని వాటినే కొనసాగించామని అన్నారు. టీడీపీ మంజూరు చేసిన ప్రాజెక్టుల పనులన్నీ వైసీపీ రద్దు చేసిందని... ఈ ఏడాదిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని వ్యాఖ్యలు చేశారు.
నిజానికి పోతిరెడ్డిపాడు పనులు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలు కావడం... పూర్తి కావడం జరిగాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు గతంలో కూడా క్రెడిట్ కోసం అనేక సందర్భాల్లో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఏం మారలేదని పలువురు నెటిజన్లు చంద్రబాబు వ్యాఖ్యలపై కామెంట్లు చేయడం గమనార్హం.