
ఏకంగా దేవునికి కూడా చొరబాటు దారుడిగా ముద్ర వేశారు..?
ప్రస్తుతం భారతదేశంలో హిందూ మతం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. మన దేశంలో ఉన్న ఇతర మతాలు విదేశాల్లో ఉన్నప్పటికీ హిందూ మతం ఉన్న దేశం మాత్రం భారత దేశం ఒక్కటే. అయితే ప్రస్తుతం భారతదేశంలో హిందూ మతానికి ఉన్న నిలువెత్తు రూపం రాముడు అన్న విషయం తెలిసిందే. ఒక కారణ జన్ముడుగా భూమిపై పొట్టి లోకకల్యాణం కోసం రావణాసురున్ని చంపి రాముడు అందరికీ దేవుడు గా మారిపోయాడు. అటు హిందువుల మత గ్రంధంగా రామాయణం కూడా ఉంది. అంటే విష్ణు దేవుడి మరొక రూపమే రాముడు అనే విషయం తెలిసిందే.
భారతదేశంలో హిందువులందరూ రాముని ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. ఏకంగా అయోధ్యలో రామమందిరం కోసం దేశంలోని హిందువులందరూ ఏకతాటిపై నిలిచి పోరాడిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొంతమంది వ్యక్తులు మాత్రం... ఏకంగా మన దేవుళ్ళ పైన పేరడీలు చేస్తుంటారు. మన దేవునిపైనే జోకులు వేస్తూ ఉంటారు. కనీసం ఆ దేవుడికి కూడా గౌరవం ఇవ్వకుండా జోకులు పేల్చడం పేరడీలు చేయడం లాంటివి చేస్తూ కించ పరుస్తూ ఉంటారు. ఇక తాజాగా విచిత్ర సంఘటన జరిగింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆరవ తరగతి పాఠ్యపుస్తకంలో రాముడు గురించి విచిత్రంగా రాసి ఉంది. రాముడు భారత దేశానికి చెందిన వాడు కాదు విదేశీయుడని.. విదేశాలనుంచి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించాడని.. రాముడు ఒక సంచారి.. అయితే రోమింగ్ అనే పదమే రాముడు అనే పదం నుంచి వచ్చింది అంటు ... ఆ పాఠంలో సాగిపోయింది. చివరికి దేశ వ్యాప్తంగా పూజించే దేవుడిని సైతం చొరబాటుదారులు చేసేసారు . భారత్ లోకి చొరబడి దురాక్రమణ చేసి వ్యవస్థలను కుప్పకూలుస్తున్న వారి నేమో సెక్యులరిస్టులు అంటున్నారు అదే భారత దేవున్నేమో చొరబాటుదారులు అనడం నిజంగా విడ్డురం అంటున్నారు విశ్లేషకులు.