విశాఖ గ్యాస్ లీకేజ్: టీడీపీ చేస్తున్నది దారుణం...ఇంతలా చేస్తారా?

M N Amaleswara rao

కరోనా తర్వాత దేశాన్ని కుదిపేసిన దారుణ ఘటన ఏదైనా ఉందట అది విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ సంస్థలో గ్యాస్ లీకై వందలాది మంది ప్రజలు చావు అంచులకు వెళ్లడం. అయితే ఈ ప్రమాదం ఏ తప్పిదం వల్ల జరిగినా..అక్కడ చుట్టూ పక్కల ఉన్న ప్రజలు నరకయాతన అనుభవించారు. 10 మంది వరకు ప్రాణం కోల్పోయారు. ఇక ఈ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్, బాధితుల్ని పరామర్శించడం,  వెంటనే చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

 

అలాగే వెంటిలేటర్ పై చికిత్స పొందేవారికి 10 లక్షలు, చికిత్స తీసుకుంటున్న వారికి లక్ష, ఆ కంపెనీ దగ్గరలో ఉన్న ప్రజలకు రూ. 10 వేలు సాయం, చనిపోయిన పశువులు, జంతువులకు కాంపన్సేషన్ కింద రూ. 20 వేలు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విధంగా విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై త్వరగా స్పందించి, జగన్ సాయం చేస్తే, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని పూర్తిగా నెగిటివ్ చేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.

 

అసలు ముందు నుంచి టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో జగన్ పై విషం చల్లుతూనే ఉన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వచ్చారు. ఇక కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి కూడా జగన్, కరోనా కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా జగన్ మీడియా సమావేశాలని వక్రీకరిస్తూ సెటైర్లు వేశారు.

 

ఇక తాజాగా కూడా విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై కూడా స్పందిస్తూ...జగన్ పై విషం చల్లుతున్నారు. ఏ ముహూర్తాన సీఎం అయ్యారో తెలియదు గానీ, రాష్రమంతటా దరిద్రం అన్ని రంగాల్లో ప్రజ్వలిస్తోందని పోస్టులు పెడుతున్నారు. అంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైనట్లు మాట్లాడుతున్నారు. విపత్తు సమయంలో కూడా టీడీపీ కార్యకర్తలు జగన్ పై విమర్శలు చేస్తూ, వికృత ఆనందం పొందుతున్నట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: