మంత్రి ఆ విషయం మరిచిపోయారా? ఆ మాట ప్రజలని అడిగితే బెటర్ ఏమో?

M N Amaleswara rao

ఏపీలో కరోనాపై రాజకీయం ఓ రేంజ్ లో జరుగుతుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య రోజు కరోనాపై మాటల యుద్ధం జరుగుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, కరోనా కేసులని దాచిపెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా వాటికి కౌంటర్లు ఇస్తూ, ఆఫీసుల్లో, ఇళ్లల్లో కూర్చుని విమర్శలు చేయడం మానుకోవాలని చెబుతున్నారు.


ఈ క్రమంలోనే మంత్రి అవంతి శ్రీనివాస్ కరోనా కేసులని దాస్తున్నామని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలని ఖండించారు. అలాగే టీడీపీ నాయకులు దోచుకుని దాచుకున్న సొమ్మును బయటకు తీసి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. అన్న క్యాంటీన్లు లేకున్నా అంతకు మించి పేదలకు భోజనాలు పెడుతున్నామని చెప్పారు.

 

ఇక మంత్రి చేసిన వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక దానిని దృష్టిలో పెట్టుకునే మంత్రి, టీడీపీ నేతలు దోచుకుని, దాచుకున్న సొమ్ముని ప్రజలకు పంచాలని అన్నారు. అయితే ఆ ఐదేళ్లు అవంతి ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. అవంతి ఐదేళ్లు టీడీపీ ఎంపీగా ఉన్నారని, ఆయన కూడా దోచుకుని, దాచిన సొమ్ముని ప్రజలకు పంచాలని అంటున్నారు. ఇంకా మరికొందరు నేతలు బాబు కొట్టేసిన వేల కోట్లు కూడా పంచాలని చెబుతున్నారని, ముందు జగన్ లక్ష కోట్లు పంచితే బాగుంటుందేమో అని కౌంటర్ ఇస్తున్నారు.

 

అదేవిధంగా చంద్రబాబు పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లలని తీసుకొస్తే వాటిని జగన్ మూసేసారని, ఇప్పుడు అవి ఉంటే పేద ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేవని చెబుతున్నారు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా పేదలకు భోజనం అందిస్తే, మంత్రి  ఆ  విషయం డైరక్ట్ గా ప్రజల దగ్గరకు వెళ్లి అడిగితే మంచిదని,  తమరు ఏ స్థాయిలో భోజనం అందిస్తున్నారో,  వారికి అన్నా క్యాంటీన్ కావాలో, వద్దో చెబుతారని మంత్రికి రివర్స్ ప్రశ్నలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: