అమ్మ కోసం దొంగతనం చేసా అన్న బాలుడు... జడ్జి ఏం తీర్పు ఇచ్చాడో తెలుసా..?

praveen

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చాలా మంది ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక పూట కూడా నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండాల్సి వస్తుంది. లేదా పూర్తిగా  తిండి కూడా దొరకని పరిస్థితి. దీంతో పేదల జీవితాలు రోజురోజుకూ దుర్భరంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో ఓవైపు కరోనా చావు కేకలు వినిపిస్తుంటే...  మరోవైపు పేదల ఆకలి కేకలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా  కష్ట కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక మైనర్ బాలుడు దొంగతనం చేశాడు. కానీ ఆ మైనర్ బాలుడు పరిస్థితిని అర్థం చేసుకుని జడ్జి  మంచి మనసులు చూపించాడు. ఈ ఘటన బీహార్లోని నలంద లో చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే నలంద ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలుడు దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. అయితే తాను దొంగతనం చేయడానికి గల కారణం ఏమిటో చెప్పడంతో అందరి మనసు కరిగిపోయింది . మాకు  కనీసం తినడానికి తిండి కూడా లేదు ఇదే సమయంలో మా అమ్మ తీవ్ర అనారోగ్యం పాలైంది దీంతో అమ్మకు ఏదైనా తినిపించాలని భావించి దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయాను  ఇంతలో పోలీసులు పట్టుకుని  నన్ను కొట్టారు. నేను దొంగతనం చేయడానికి మా పేదరికం మా అమ్మ ఆకలి కారణం అంటూ చెప్పడంతో అది విన్న జడ్జి మనసు కరిగిపోయింది.

 

 

 

ఇక ఆ మైనర్ బాలుడు బాధను అర్థం చేసుకున్న జడ్జి  గారు... సదరు యువకుని లో మార్పు రావడానికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా న్యాయమూర్తి ఆదేశంపై సదరు మైనర్ బాలుడికి  అవసరమైన వస్తువులు కూడా సమకూర్చలని  వివరించారు. కాగా  ఈ తీర్పుపై అటు గ్రామస్థులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: