కటింగ్, షేవింగ్ చేయించుకునే వారికి షాకింగ్ న్యూస్... కరోనాకు కేరాఫ్ అడ్రస్ బార్బర్ షాప్స్...!

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా కొన్ని వ్యాపార, వాణిజ్య సేవలకు కేంద్రం సడలింపులు ఇచ్చింది. సడలింపుల విషయంలో కరోనా ప్రభావాన్ని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా సెలూన్ షాపులు మూతబడ్డాయి. 
 
 
కొందరు రోజురోజుకు కటింగ్ పెరుగుతోందని... సెలూన్ షాపులు తెరిచేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ను ఒక వ్యక్తి సెలూన్ షాపులు తెరిపించాలంటూ కోరారు. సోషల్ మీడియాలో వ్యక్తి సెలూన్ షాపులు తెరిపించాలని కోరడం తెగ వైరల్ అయింది. అయితే తాజాగా కటింగ్ షాపుల వల్ల కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 
సెలూన్ షాపులు తెరిస్తే మాత్రం కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో 50 శాతం పైగా కేసులు సెలూన్ షాపుల నుంచే వచ్చాయని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సెలూన్ షాపుల్లో కుర్చీ, బ్రష్, రేజర్, టవల్ అందరికీ ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. వారిలో ఒక్కరికీ కరోనా ఉన్నా ఇతరులకు కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 
 
అందువల్ల కటింగ్ షాపులు తెరిచినా వైరస్ ఉధృతి తగ్గే వరకు ఇళ్లకే పరిమితం కావడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కటింగ్ షాపుల ద్వారా కరోనా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈరోజు ఉదయం వరకు దేశంలో 17,265 కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,645 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవ్వగా 543 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: