చంద్రబాబుకు మంచి సలహా...పాటిస్తారా? అదొక్కటే తేడాగా ఉందే!
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కరోనాని కట్టడి చేసేందుకు అటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇటు ఏపీ జగన్ లు ఎక్కువ కష్టపడుతున్నారు. పైగా ఆర్థికపరంగా నష్టం జరుగుతున్నా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే ఈ లాక్ డౌన్ సమయంలో పేదలని ఆదుకుంటున్నారు.
ఇదే సమయంలో ఏపీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు, లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసంలో ఉండిపోయారు. దీంతో ఇక్కడి నుంచే కరోనా కట్టడి చేయడంలో భాగంగా జగన్ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు, లేఖల ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులని యాక్టివ్ చేసి, ప్రజలని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుకు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ చక్కని సలహా ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న చంద్రబాబు, పోలీసు పాస్ తీసుకుని అక్కడి పేద ప్రజలకు ఏదైనా సాయం చేయొచ్చుగదా అని చెప్పారు. ఎలాగో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలకు అండగా నిలుస్తున్నారు. కాబట్టి అక్కడ ఆశ్రయం పొందుతున్నందుకైనా బాబు కొంత బాధ్యత తీసుకోవాలని అంటున్నారు.
అలాగే చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లే ఇచ్చి...విజయసాయి గట్టి కౌంటర్ వేశారు. చంద్రబాబుకు ఏపని చేసినా నిజాయితీ ఉండదని కర్మ కాలి ఇప్పుడు సిఎంగా ఉండుంటే కరోనా కేసులను వేలల్లో చూపించి, ప్రాణనష్టం లేకుండా చేశా అని దేశమంతా డప్పుకొట్టుకుని తిరిగేవాడని ఎద్దేవా చేశారు. ఇక విజయసాయి కామెంట్ పై నెటిజన్లు కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. నిజమే కదా చంద్రబాబు హైదరాబాద్ లో ప్రజలకు అండగా ఉండొచ్చు కదా..పైగా అక్కడ కూడా ఏపీ ప్రజలు పెద్దగా సంఖ్యలో ఉన్నారని చెబుతున్నారు. మరి విజయసాయి ఇచ్చిన ఈ సలహా బాబుకు ఏ మాత్రం చేరుతుందో చూడాలి.