మీడియా మంటలు: నీతులు చెప్పే ఆర్కే.. ఉద్యోగుల తిట్లు వినిపిస్తున్నాయా..?

Chakravarthi Kalyan
ఆర్కే.. వేమూరి రాధాకృష్ణ.. ఆంధ్రజ్యోతి పత్రికకు ఎండీ.. అలాగే ఆంధ్రజ్యోతి ఛానల్‌ కూడా ఆయనదే. మీడియా కూడా ఓ వ్యాపారమే. కాకపోతే.. కాస్త సామాజిక బాధ్యత కలిగిన వ్యాపారం. ప్రజలకు వార్తలు చూపిస్తూ, చదివిస్తూ ప్రకటనలు అమ్ముకునే వ్యాపారం. వ్యాపారాధినేతలు ఎప్పుడూ లాభాల గురించే ఆలోచిస్తారు. లాభాలు వస్తే వెనకేసుకుంటారు. కోట్ల గడిస్తారు. కోటలు కడతారు.

కాస్త నష్టాలు రాగానే.. ఉద్యోగస్తుల జీతాల వైపు చూస్తారు. వారి త్యాగాలు కోరతారు. కరోనా కష్టకాలంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతి మీడియా ఎండీ రాధాకృష్ణ కూడా అంతే. అయితే ఇక్కడ ఓ తేడా ఉంది. రాధాకృష్ణ స్వతహాగా వ్యాపారవేత్త కాదు.. ఆయన కూడా ఓ జర్నలిస్టు. ఇప్పుడు తాను అధిపతి అయిన ఆ పత్రికలో సాధారణ రిపోర్టరుగా పని చేసినవాడే. పాత్రికేయుల కష్టసుఖాలు తెలిసినవాడే. జర్నలిస్టుల జీవితాల్లోని అలజడులన్నీ అనుభవించివాడే.

అలాంటి వాడే ఇప్పుడు కాస్త కష్టం రాగానే.. తన మీడియాలో పని చేసే జర్నలిస్టులను రోడ్డున పడేస్తున్నాడు. జిల్లా స్థాయిలో 50 శాతం వరకూ ఉద్యోగులను ఊడపీకేస్తున్నాడు. అంతే కాదు.. ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఏ ఒక్కరి ఉద్యోగానికీ భరోసా లేదు. ఈ రోజు ఆఫీసులో కనపడిన వాడు రేపు మళ్లీ కనిపిస్తాడన్న గ్యారంటీ లేదు. అంత దారుణంగా ఉంది ఆంధ్రజ్యోతి ఉద్యోగుల దుస్థితి.

నిజమే.. ఆర్థికంగా నష్టాలు వస్తూ ఏ సంస్థనూ నడపలేరు. అయితే నెల రోజుల కష్టాలకే అప్పుల్లో కూరుకుపోయేంత దారుణమైన పరిస్థితులో ఆంధ్రజ్యోతి ఉందా.. కనీసం తన ఉద్యోగులకు నాలుగైదు నెలలు కూడా సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదా.. ఇప్పుడంటే ఏపీలో వైసీపీ సర్కారు వచ్చింది. అంతకు ముందు చంద్రబాబు హాయాంలో ఆయన అండదండలతో సంపాందించుకున్న కోట్లాది ఆస్తులన్నీ ఏమైపోయాయి.. ఇవీ సొంత ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు తన ఆదివారం కొత్త పలుకులో చెబుతాడని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: