ఇవి కొంచెం ఓవర్: టీడీపీ ఉంటే చేస్తుందా?

M N Amaleswara rao

కరోనా మహమ్మారిపై ఏపీలోని జగన్ ప్రభుత్వం తీవ్ర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు పరిస్థితులని సమీక్షిస్తూ, సీఎం జగన్ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కృషి చేస్తున్నారు. అలాగే మరోవైపు లాక్ డౌన్‌ని మరిన్ని రోజులు పొడిగించాలని చూస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకునే వీలు కల్పించారు. అలాగే పేద ప్రజలకు ఉచిత రేషన్, రూ. 1000 రూపాయలు అందించారు.

 

అయితే ప్రభుత్వం ఎంత  చేసినా, ప్రతిపక్ష టీడీపీ ఊహించని డిమాండ్లు ముందు పెడుతూ రాజకీయం చేస్తోంది. తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేసుకుని, అందులో కరోనా వైరస్‌, బాధితుల ఆందోళన, వైద్యుల ఇక్కట్లు, పంటలకు గిట్టుబాటు ధరలు, రైతుల సమస్యలపై చర్చించారు. ఇక తర్వాత ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు.

 

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలని, కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.5 వేలు ఇవ్వాలని, కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, కరోనా వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని, పేదలు, రైతులు, సెలూన్ షాపుల కరెంటు, నీటి బిల్లులను రద్దు చేయాలని సూచించింది. అయితే కొన్ని డిమాండ్లు బాగానే ఉన్నా, మరికొన్ని డిమాండ్లు రాజకీయం కోసం చేశారని అర్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు.

 

అయినా సరే జగన్ ప్రభుత్వం ఉచిత రేషన్, వీలు కుదిరిన చోట ఉచితంగా నిత్యాసవర వస్తువులు అందిస్తున్నారు. అలాగే వెయ్యి రూపాయలు కూడా సాయం చేశారు. కానీ టీడీపీ మాత్రం 5 వేలు ఇవ్వమంటుంది. అలాగే కరోనాతో మృతి చెందితే 25 లక్షలు ఇవ్వమంటుంది. ఇక ఇవి చాలా ఓవర్ డిమాండ్లుగా ఉన్నాయి. అసలు టీడీపీ అధికారంలో ఉన్నా, ఇలా చేయదు. ఆఖరికి ఇప్పుడు జగన్ చేస్తున్నట్లు కూడా చేయదు. కానీ రాజకీయం కోసం వైసీపీని ఇబ్బంది పెట్టాలని బాబు అండ్ కో ఇలాంటి డిమాండ్లు చేశారని అర్ధమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: