ఒక్క వ్యక్తి కారణంగా 26 వేల మంది క్వారంటైన్ పాలు..?
భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడి కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ... కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నప్పటికీ... కొన్ని పొరపాట్లు కొంతమంది నిర్లక్ష్యం కారణంగా దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండగా.. కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి చేయి దాటి పోయే లా కనిపిస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల నిబంధనలు అమలు చేసి ప్రజలను ఇంటికే పరిమితం అయ్యేలా చేసినప్పటికీ ఎక్కడ కరోనా వైరస్ నియంత్రణ మాత్రం జరగడం లేదు.
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇక్కడ ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన విందు ఏకంగా 26 వేల మందిని క్వారంటైన్ పాలు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పటికే దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్నారు కూడా. మహారాష్ట్రలోని మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్ లో వెయిటర్ గా పని చేస్తున్నాడు. నెల 17న అతడి తల్లి చనిపోవడంతో దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఆ వ్యక్తి... మార్చి 20వ తేదీన సాంప్రదాయం ప్రకారం తల్లి మృతికి సంతాపంగా ఓ విందు ఏర్పాటు. బంధుమిత్రులందరికీ పిలిచారు.
ఇక ఆ వ్యక్తి ఏర్పాటు చేసిన సంతాప విందుకు ఏకంగా 1200 మంది బంధుమిత్రులు హాజరయ్యారు. అయితే మార్చి 27న దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తితో పాటు అతని భార్య కూడా కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేరారు. అయితే వారికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. తాను దుబాయిలో వెయిటర్ గా పనిచేస్తానని తన తల్లి మృతిచెందడంతో నగరానికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తల్లికి సంతాపంగా ఓ విందు ఏర్పాటు చేసినట్లు కూడా అధికారులకు తెలిపాడు. ఇక ఈ విందులో పాల్గొన్న మరో పదిమందికి కరోనా వైరస్ సోకినట్లు ఈ నెల 3వ తేదీన నిర్ధారణ అయింది. అధికారులు ఒక్కసారిగా విందుకు హాజరైన వారందరిని వారికి సన్నిహితంగా మెలిగిన వారందరిని ఏకంగా 26 వేల మందిని హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా కోరారు.