ఏప్రిల్ 1 7 PM కరోనా బాధిత నెంబర్లు ... ఏపీ, తెలంగాణ టు వరల్డ్‌వైడ్ నెంబర్లు ఇవే..!
కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ తమ రాష్ట్రానికి రూ. 25 వేల కోట్లను మంజూరు చేయాలని... అలాగే ఇంతకుముందు రావాల్సిన ఫండ్స్ లని కూడా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాతపూర్వకంగా తెలియజేశారు. మార్కాజ్ నిజాముద్దీన్ మతపరమైన ప్రార్థనలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 71 మంది హాజరయ్యారని తాజాగా సమాచారం అందింది. ఈ మతపరమైన ప్రార్థనలలో 62 మంది ఇండోనేషియా దేశస్తులు పాల్గొన్నారని... అనంతరం వారంతా తమ రాష్ట్రానికి వచ్చేశారని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీ రాములు చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటివరకు 90 కేసులు నమోదయ్యాయని... అందులోని ఇద్దరు ఇటాలియన్ దేశీయులని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది.
కేరళ రాష్ట్రంలో 24 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని... వీటిలో కాసర్గోడ్ లో 12... ఎర్నాకుళం లో 3... తిరువనంతపురం, త్రిస్సూర్, మలప్పురం, కన్నూర్‌లలో 2... పాలక్కాడ్ లో 1 కేసు నమోదయ్యాయని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తాజాగా తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్19 కేసుల సంఖ్య 265 కి చేరుకొంది.
ఇకపోతే మహారాష్ట్రలో అత్యధికంగా 322 కేసులు నమోదయ్యాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కరోనా బాధితుల సంఖ్య 62కి చేరుకుందని... వీటిలో 58 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఓ ఉన్నతాధికారి రోహిత్ కన్సల్ చెప్పారు. హర్యానాలో ఇప్పటివరకు 29 కేసులు నమోదయ్యాయని హర్యానా ఆరోగ్య శాఖ తెలిపింది. నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని 15 జిల్లాల్లో మొత్తం 110 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ మతపరమైన సదస్సుకు హాజరైన వారి వల్ల కరోనా వైరస్ కేసుల సంఖ్య 9 గంటల వ్యవధిలోనే రెట్టింపు అయింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 97 చేరుకుంది. ఏప్రిల్ 7 లోపు కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని ప్రజల్లో కొండంత ధైర్యం నింపారు కెసిఆర్. మరి ఈ వారం రోజుల అనంతరం కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఉంటుందో చూడాలిక.
ఒక్కసారి తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచవ్యాప్తంగా కేసుల కేసుల సంఖ్య చూసుకుంటే...
ప్రపంచంలో మొత్తం కేసులు: 882,068
మరణాలు: 44,136
రికవరీ కేసులు: 185,067
ఇండియాలో మొత్తం కేసులు: 1,771
మరణాలు: 31
కొత్త కేసులు: 214
రికవరీ కేసులు: 100
తెలంగాణలో మొత్తం కేసులు: 97
మృతులు: 6
ఏపీలో మొత్తం కేసులు: 87
మృతులు: 0
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple