షాకింగ్: కరోనా గురించి తను చనిపోక ముందే వివరించిన మైఖేల్ జాక్సన్!

Arun Showri Endluri
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న కరొనా మహమ్మరిని అణిచివేసేందుకు ఏ ఒక్క మార్గం కనపడట్లేదు. భారత్ తో సహా అన్నీ దేశాలన్నీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేయగా…. అగ్ర రాజ్యం అమెరికా ను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ వల్ల చాలామంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉన్న కొద్ది వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న చాలా రాష్ట్రాలలో ఆ దేశ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

అంతేకాకుండా మిలటరీ ని రంగంలోకి దింపి ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. అయినా కానీ పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం అక్కడ కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య చైనాను దాటేసిందట.అమెరికా లో గురువారం నాటికి ఆ దేశంలో 83,545 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

అయితే ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ కరోనా గురించి ముందుగానే ప్రపంచాన్ని హెచ్చరించాడట. ప్రపంచంలో తన వైవిధ్యమైన సంగీతంలో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న మైఖేల్ దగ్గర దశాబ్దంన్నర కాలం పనిచేసిన బాడీగార్డ్ మ్యాట్ ఫిడ్డెస్‌ ఇటీవల ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన మీడియా ముందు ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆయన ఏమన్నారంటే ఆరోగ్యం గురించి మైఖేల్ జాక్సన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ఏదొక రోజు ప్రపంచమొత్తం సుక్ష్మ జీవుల బారిన పడి ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని జాక్సన్ చెప్పినట్లు మ్యాట్ ఫిడ్డెస్‌ తెలిపారు. అందుకే మనం గమనించినట్లైతే…. మైకేల్ ఎప్పుడూ ఫేస్ మాస్క్, గ్లౌజులు ధరించేవాడు. అందరూ దీనిని స్టైల్ కోసం అనుకుంటే.. వైరస్ వ్యాధుల బారిన పడకుండా ఎలప్పుడూ ఆరోగ్యం విషయంలో జాక్సన్ ఈ జాగ్రత్తలు తీసుకునేవారని జాక్సన్ బాడీగార్డ్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: