జనతా కర్ఫ్యూ : అసలు ప్రయోజనం ఏంటి.. ఆసక్తిగా చూస్తున్న ప్రపంచ దేశాలు.?

praveen

భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు జనతా కర్ఫ్యూ కు  పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేవలం మనుషుల్లోనే కాకుండా వస్తువులు ప్రదేశాలపై కూడా 12 గంటల పాటు మహమ్మారి వైరస్  బతికే ఉండే అవకాశం ఉండటం వల్ల... భారత ప్రజలు అందరూ ఎక్కడికి వెళ్ళకుండా కేవలం ఇంట్లోనే ఉంటూ 14 గంటలు జనతా కర్ఫ్యూ  పాటించాలి అంటూ పిలుపునిచ్చారు. ఇలా ప్రజలందరూ కేవలం ఇళ్లకే పరిమితం కావడం వల్ల బయట ఉన్న ప్రదేశాలలో ఉన్న కరోనా  వైరస్ 12గంటల్లో  నశించిపోతుందని తద్వారా... కరుణ వైరస్ నుంచి కాస్త ప్రమాదం తప్పుతుంది అంటూ ప్రధాని మోడీ తెలిపారు. అయితే ప్రస్తుత ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తోంది.

 

 

 ఇప్పటికే ఇటలీ బ్రిటన్ చైనా లోని వుహాన్  నగరం.. ఇలా కరోనా వైరస్ విజృంభన ఎక్కువగా ఉన్నా అన్ని నగరాలు దేశాలు పూర్తిగా నిర్బధం లోకి  మారిపోయాయి. ఇక చాలా దేశాలు కూడా ఇలా లాక్ డౌన్ చేసే ఆలోచనలో ఉన్నాయి. తమ తమ దేశాల ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా చైనా తర్వాత వైరస్ ఎక్కువగా విజృంభిస్తున్న దేశం యూరప్ లో ఇప్పటికే నిర్బంధం అమలవుతోంది. ప్రజలందరూ తమకు కావాల్సిన నిత్యవసర వస్తువులను కూడా కేవలం బయటకు వెళ్లకుండా ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. కరోనా  వైరస్ నియంత్రణకు పూర్తిగా సహకరిస్తున్నారు. అయితే భారత ప్రజలందరూ ఇంటికే పరిమితమై 14 గంటలపాటు గడపడం కష్టమే అయినప్పటికీ... దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత జాతి మేలు కోసం.. దేశ ప్రజలందరి సున్నితంగా ఒప్పించారు. దీంతో సాహసోపేతమైన యజ్ఞాన్ని పాటిస్తున్నారు భారత ప్రజలు. 

 

 

 అయితే జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైళ్లు బస్సులు విమానాలు అన్ని బంద్ అయ్యాయి. ఇప్పటికే షాపులు, షాపింగ్ మాల్స్ స్కూలు,  పార్కులు, హోటళ్లు అని మూతపడ్డాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఒక్కరు కూడా బయట కనిపించడం లేదు. దీంతో ప్రపంచం చూపు మొత్తం భారతదేశం వైపు మళ్ళింది. ప్రస్తుతం ప్రధాని మోదీ ఆలోచనతో ఇండియాలో కరోనా కరోనా  వైరస్లు పారదోలడం లో విజయం సాధిస్తే ప్రపంచ దేశాలు కూడా ఇదే పద్ధతిని పాటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీని ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రపంచ దేశాలు వేచి చూస్తున్నాయి. అయితే మరోసారి భారత ప్రజల అందరి ఐక్యతను... సమన్వయాన్ని బలాన్ని చాటి దేశం ఒక్కటే ప్రజలందరూ ఒక్కటే అని నిరూపించుకొని ప్రపంచ దేశాలు సైతం సలాం చేసేలా చేస్తున్నారు భారత ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: