రాజధాని ఎక్స్ ప్రెస్ లో కరోనా పేషెంట్లు కలకలం... ట్రైను ఆపి ప్రయాణికులు ఏం చేశారంటే..?

frame రాజధాని ఎక్స్ ప్రెస్ లో కరోనా పేషెంట్లు కలకలం... ట్రైను ఆపి ప్రయాణికులు ఏం చేశారంటే..?

Suma Kallamadi

గురువారం రోజు ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ గురించి గంటలు గంటలు మాట్లాడుతూ తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ఎంతో ఓపికతో చెప్పారు. కరోనా మహమ్మారిని అరికట్టే బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉందని... అలా అయితేనే ఈ మహమ్మారిని నాశనం చేయగలమని... అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తూ ఇంట్లోనుండి బయటకు రాకుండా... ఏకాంతగా ఉంటూ కరోనాపై యుద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ కొంతమంది మాత్రం మోడీ మాటలను ఖాతరు కూడా చేయడం లేదు. ఇటీవల బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ విదేశాల్లో ఇష్టారాజ్యంగా తిరిగి... మళ్ళీ స్వదేశానికి వచ్చి కోవిడ్-19 టెస్ట్ చేయించుకోకుండా... కాస్తయినా బాధ్యత లేకుండా... డిన్నర్ పార్టీలంటూ ఎగేసుకొని వెళ్లి అందర్నీ ప్రమాదంలోకి తోసేసింది. అది మరవకముందే మళ్ళీ ఈ రోజు ఏమో అత్యంత బాధ్యతారాహిత్యమయిన పనిని ఓ ఇద్దరు చేసి అందరి ఆగ్రహానికి కారణం అవుతున్నారు.




వివరాలు తెలుసుకుంటే... శనివారం రోజు ఉదయం రాజధాని ఎక్సప్రెస్ హైదరాబాదు నుండి ఢిల్లీకి బయలుదేరుతుండగా ఓ యువతి ఓ యువకుడు ఆ ట్రైన్ ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత ట్రైన్ కదిలింది. చాలా మంది వీళ్లిద్దరూ ఉన్న భోగి లోకే ఎక్కారు. కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత... ఆ యువతి మణికట్టుపై ఒక గుర్తుని గమనించారు ప్రయాణికులు. ఆపై 'ఏంటమ్మా ఆ గుర్తు?' అంటూ ప్రశ్నించారు. దానికి ఆమె 'టాటూ, అండీ' అని చెబుతూ ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. కానీ అటువంటి గుర్తే తన పక్కన నిల్చున్న యువకునిపై కూడా కనిపించింది. దాంతో బాగా అనుమానం వచ్చిన ప్రయాణికులు... ' ఆ మార్కు లు ఏమిటో చెప్పండి' అని గద్దయించారు. దాంతో భయపడి పోయిన ఆ ఇద్దరు... '2 రోజుల క్రితం, మాకు వికారాబాద్ డాక్టర్ చెకప్  చేశారు. తరువాత మమల్ని కరోనా వైరస్ సోకిన అనుమానితులుగా తేల్చారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఎక్కడికి వెళ్లొద్దు అని ఆర్డర్ కూడా చేశారు. కానీ మేము ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నాం' అని చెప్పారు.




దాంతో ఒక్కసారిగా షాకైన మిగతా ప్రయాణికులు అంతా వీళ్ళిద్దరికీ దూరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి విషయమంతా చెప్పేసారు. తక్షణమేేే స్పందించిన పోలీసులు వైద్య సిబ్బందితో పాటు ఆ ట్రైన్ లోకో పైలట్ కు కూడా సమాచారం అందించారు. దాంతో లోకో పైలట్ రాజధాని ఎక్సప్రెస్ ని నెక్స్ట్ స్టేషన్ అయిన కాజీపేటలో ఆపాడు. స్టేషన్ లో ఆగగానే అంబులెన్సులో అక్కడికి వచ్చేసిన వైద్య సిబ్బింది ఆ ఇద్దరు కరోనా అనుమానితులను ఖాళీ చేయించి ట్రైన్ దింపేశారు. ఆ తరువాత వారు ఎక్కిన భోగిని మొత్తం శానిటైజ్ చేయించి ప్రయాణికులను వేరొక భోగికి తరలించిి ట్రైన్ ని పంపించేశారు. ఆపై కరోనా అనుమానితులని అంబులెన్సు లోకి ఎక్కించి స్థానిక ఆసుపత్రి కి తరలించారు. ఏది ఏమైనా డాక్టర్ల మాట పెడచెవిన పెట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఉంటే కరోనా మహమ్మారికి లక్షల మంది చనిపోయే ప్రమాదం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: