టాలీవుడ్ డిజాస్టర్ 2024: ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ స్టార్ అయ్యాడుగా
ఈ సినిమాలోని సన్నివేశలు హైదరాబాద్ అలాగే న్యూయార్క్‌లోని ప్రదేశాలతో చిత్రీకరించబడ్డాయి. ఫ్యామిలీ స్టార్ సినిమాని మొదట సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ సినిమాను రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కానీ రూ. 19.78-23.20 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ బాంబుగా నిలిచింది. విజయ్ దేవరకొండ, మృణాళ్ థాకూర్ జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత చాలా విమర్శలు అందుకుంది. యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాకు నైజాం ఏరియా హక్కులు 14 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4.5 కోట్లు, ఆంధ్రా 17 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా 34 కోట్లకుపైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్లు కలిపి 8 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బిజినెస్ మొత్తంగా 44 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఏపీ, తెలంగాణలో తొలి రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 3 కోట్ల రూపాయలు, మూడో రోజు 4 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రూపాయలు, 6వ రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలు వసూలుచేసింది.