పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. సిద్ధార్థ్ కి అక్కడ మండిపోయిందిగా..?

praveen
సౌత్ ఇండియన్ హీరో సిద్ధార్థ గురించి స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు. పేరుకి తమిళ నటుడే అయినా ఈ హీరో మన తెలుగు వారికి కూడా బాగా సుపరిచితుడు. బొమ్మరిల్లు, ఓయ్, రెడీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, గృహం వంటి ఎన్నో సినిమాలతో టాలీవుడ్ ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాడు సిద్ధార్థ్. ఈ హీరో ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు కానీ అతనికి ఇక్కడ ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నటుడు ఓ మంచి రొమాంటిక్ సినిమా చేస్తే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు.
ఇప్పుడీ హీరో "మిస్ యు" మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది తమిళంలో, తెలుగులో ఒకేసారి రిలీజ్ అయింది. ఆషికా రంగనాథ్ హీరోయిన్. కానీ తెలుగులో దీనికి అసలు రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు పుష్ప-2 మేనియా నడుస్తోంది. కోలీవుడ్ లో మొదట కొంచెం రెస్పాన్స్ వచ్చినా తర్వాత దీన్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ కాబట్టి మినిమమ్‌ గ్యారెంటీ అనుకున్నారు కానీ సిద్ధార్థ్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పతనమైంది.
జోక్ ఏంటంటే, ఈ మూవీకి మంచి రివ్యూసే వచ్చాయి, కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాలడం లేదు. ఇది రిలీజ్ అయ్యి నాలుగు రోజులు కావస్తుండగా ఇప్పటికీ జస్ట్  రూ.2.39 కోట్లు వచ్చాయి. ఒక పెద్ద హీరో సినిమాకు ఫస్ట్ డే ఇంత తక్కువ కలెక్షన్లు రావడం నిజంగా బాధాకరం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఫోర్త్ డే ఈ మూవీ జస్ట్ రూ.41 లక్షలు కలెక్ట్ చేసింది. అంటే ఒక సాధారణ నటుడుకు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా ఇది కలెక్ట్ చేయలేకపోయింది. ఇంకా పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం కష్టమే అనిపిస్తోంది.
అయితే సిద్ధార్థ్ విడుదలకు ముందుగా నడుచుకున్న ప్రవర్తనే ఇలాంటి పూర్ కలెక్షన్ కి కారణమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వారి ప్రకారం ఈ హీరో బన్నీ, పుష్ప సినిమాలపై చెత్త కామెంట్లు చేశాడు. అల్లు అర్జున్ తో పాటు పుష్ప సినిమాని చులకన చేస్తూ మాట్లాడాడు అది చాలామందికి నచ్చలేదు. "నీ సినిమాపై నమ్మకం ఉంటే దానిపై ఎవరు అభ్యంతరం తెలపరు, కానీ వేరే సినిమాని తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు సబబు?" అని ప్రశ్నించారు. అంతేకాదు, ఇప్పుడు పుష్ప 2 వేలకోట్ల కలక్షన్లను, మిస్ యు రూ.2 కోట్ల కలెక్షన్లను పోలుస్తూ సిద్ధార్థ్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: